Unstoppable With NBK Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో మొట్టమొదటిసారి పాల్గొన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ఈ సీజన్ లో చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ ఎపిసోడ్ మొదటి భాగాన్ని ఈరోజు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ చెయ్యడం ప్రారంభించారు..ఈ ఎపిసోడ్ కి అప్పోర్వమైన రెస్పాన్స్ వచ్చింది..పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకునేందుకు అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో అమితాసక్తిని చూపిస్తారు.

అందుకు అనుగుణంగానే ప్రశ్నలు అడిగి పవన్ కళ్యాణ్ నుండి సమాదానాలు రాబట్టే ప్రయత్నం చేసాడు బాలయ్య..పవన్ కళ్యాణ్ కూడా మనసు ఎలాంటి ఫిల్టర్ లేకుండా నిజాయితీ తో సమాధానం చెప్పాడు..ముఖ్యంగా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు తాను పడిన మనోవేదన గురించి చెప్పుకుంటూ చాలా బాధ పడ్డాడు..అది చూసిన ఫ్యాన్స్ కి కన్నీళ్లు వచ్చాయి..తన మేనల్లుడు అంటే ఇంత ప్రేమ ఉందా అని అందరికీ ఈ ఎపిసోడ్ ద్వారా అర్థం అయ్యింది.

ముందుగా బాలయ్య మాట్లాడుతూ ‘నీ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయ్యినప్పుడు నువ్వు పడిన మనోవేదన గురించి నేను కూడా విన్నాను..ఏమి జరిగింది భయ్యా ఆరోజు..ఈ విషయం తెలుసుకున్న వెంటనే నీ మానసిక స్థితి ఎలా ఉండింది’ అని అడుగుతాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్తూ ‘అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను..త్రివిక్రమ్ గారు నాకు కాల్ చేసారు..ఇలా సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయ్యిందట విన్నారా అని అడిగాడు..అది తెలుసుకున్న వెంటనే నేను త్రివిక్రమ్ గారు వెంటనే హాస్పిటల్ కి పరుగులు తీసాము..సాయి ధరమ్ తేజ్ చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు..డాక్టర్లు మూడు నాలుగు రోజులైనా తర్వాత కూడా పరిస్థితి ఏంటో ఇప్పటికి చెప్పలేని విధంగానే ఉంది అని అనడం తో చాలా బాధేసింది’ అంటూ పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం పాటు ఎమోషనల్ అవ్వడం అభిమానులకు బాధ కలిగించింది.