https://oktelugu.com/

Pawan Kalyan fan letter : వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ అభిమాని ఆత్మహత్య లేఖ.. సినిమాని ఆపేయమంటూ ఏడుపులు

Pawan Kalyan fan letter : అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది..వచ్చే వారం ప్రారంభం లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరగనున్నాయి..ఈ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రాబోతుందని మూడేళ్ళ క్రితమే అధికారిక ప్రకటన చేసారు..ప్రకటన అయితే చేసారు కానీ, ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలకు కూడా నోచుకోలేదు ఈ చిత్రం..అయితే ఇప్పుడు ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2022 / 08:52 PM IST
    Follow us on

    Pawan Kalyan fan letter : అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది..వచ్చే వారం ప్రారంభం లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూజ కార్యక్రమాలు జరగనున్నాయి..ఈ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా రాబోతుందని మూడేళ్ళ క్రితమే అధికారిక ప్రకటన చేసారు..ప్రకటన అయితే చేసారు కానీ, ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలకు కూడా నోచుకోలేదు ఈ చిత్రం..అయితే ఇప్పుడు ఈ సినిమాని పూర్తి గా పక్కన పెట్టి.

    తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన విజయ్ తేరి రీమేక్ ని చెయ్యబోతున్నారంటూ ఈరోజు సాయంత్రం ఒక వార్త వచ్చింది..ఇక అంతే సోషల్ మీడియా మొత్తం నేషనల్ లెవెల్ ట్రెండ్స్ మ్యాప్ లోకి ఎక్కేలాగా అల్లకల్లోలం సృష్టించేసారు ఫ్యాన్స్..మాకు తేరి రీమేక్ వద్దు అంటూ అభిమానులు చేసిన ట్రెండ్ నేషనల్ వైడ్ లక్షకి పైగా ట్వీట్స్ తో నిమిషాల వ్యవధిలోనే టాప్ 1 స్థానం లో ట్రెండ్ అయ్యేలా చేసారు.

    పవన్ కళ్యాణ్ అభిమాని సూసైడ్ లేఖ

    ఈ ట్రెండ్ లో ఒక లేడీ వీరాభిమాని రాసిన ఆత్మహత్య లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో కలకలం సృష్టించింది..హరీష్ శంకర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ కి ఈ లెటర్ ని రాస్తూ ‘సార్..ఇంతవరుకు నేను నా జీవితం లో ఒక్క లెటర్ కూడా రాయలేదు..కానీ నేను రాసే మొదటి లేఖ నా ఆత్మహత్య లేఖ అవుతుందని కలలో కూడా అనుకోలేదు..మీరు ఎన్ని రీమేక్స్ చేసినా ఎప్పుడు ఇంత ఫీల్ అవ్వలేదు..కానీ తేరి రీమేక్ అని తెలిసిన తర్వాత ఈ లేఖని రాయక తప్పడం లేదు..కనీసం నా చావుని చూసి అయినా తేరి రీమేక్ ని క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నాను..ఇప్పటికే ఆ చిత్రం ప్రతీ ఆదివారం మంచి ప్రైమ్ టైమింగ్స్ లో మా టీవీ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు..దయచేసి ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చెయ్యండి..నా చావుకి కారణం మైత్రి మూవీ మేకర్స్ టీం మరియు డైరెక్టర్ హరీష్ శంకర్..చివరి మాట గా ఫాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి’ అంటూ ఆ అమ్మాయి రాసిన ఒక లేఖ ఇప్పుడు సంచలనం గా మారింది.