‘Waltair Veerayya’ Ravi Teja Teaser : ‘వాల్తేరు వీరయ్య’ రవితేజ టీజర్ డైలాగ్ లీక్..ఊర మాస్ ఫెస్టివల్ గ్యారెంటీ

‘Waltair Veerayya’ Ravi Teja Teaser  : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తున్నామని ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు..ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం లో తెరకెక్కిన ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ యూత్ ని […]

Written By: NARESH, Updated On : December 8, 2022 8:55 pm
Follow us on

‘Waltair Veerayya’ Ravi Teja Teaser  : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తున్నామని ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు..ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం లో తెరకెక్కిన ‘బాస్ పార్టీ’ అనే సాంగ్ యూత్ ని మరియు మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూ ఊగించేసింది.

 

ఇది కదా మెగాస్టార్ నుండి కోరుకునేది మేము అంటూ అభిమానులు ఆనంద బాష్పాలు రాల్చారు..కేవలం పాటలు మరియు డ్యాన్స్ మాత్రమే కాదు..చిరంజీవి నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి..ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన చిన్న టీజర్ ని విడుదల చేసిన మూవీ టీం , త్వరలోనే ఈ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించిన మాస్ మహారాజ రవితేజ కి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు.

ఈ వీకెండ్ లో రవితేజ టీజర్ విడుదల కాబోతుంది..అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విషయం కూడా దాగడం లేదు అనేది వాస్తవం..ఇప్పుడు ఈ టీజర్ కి సంబంధించిన డైలాగ్ కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యిపోయింది..ఇందులో రవితేజ మెగాస్టార్ చిరంజీవి కి కౌంటర్ ఇస్తూ ‘అరేయ్ ఈరి బాబు ఎందుకు ఆగమాగం చేస్తున్నావ్, నీకు తెలుసు కదా నేను ఎవడి అబ్బా మాట విననని’ అని అంటాడు..చదువుతుంటూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదూ.

ఇక రవితేజ నోటి నుండి ఇలాంటి మాస్ డైలాగ్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా..చిరంజీవి వైజాగ్ పోర్టు లో సెటిల్మెంట్స్ చేసే లోకల్ రౌడీ గా నటించాడు..వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట..ఈ చిత్రం వీళ్లిద్దరి అన్నదమ్ములు గా నటిస్తున్నారు.