Pawan Kalyan-Nara lokesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా?, గత కొద్ది రోజులుగా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీడీపీ క్యాడర్ నుండి బలంగా వినిపిస్తుంది. మరి చంద్రబాబు తన కొడుకుని ఉప ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆలోచిస్తున్నారా ?, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఈ అంశంపై ఒక రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియా లో జనసేన పార్టీ అభిమానులు గట్టిగ డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ కి అధినేత, ఆయనకి ప్రత్యేకంగా 21 సీట్లు ఉన్నాయి, ఆయన కారణంగానే కూటమి 17 శాతం మార్జిన్ తో ఘన విజయం సాధించింది. అలాంటి వ్యక్తికీ సంచిత స్థానం, గుర్తింపు లభించింది, లోకేష్ కి ఆయనతో సమానంగా ఎందుకు పదవి ఇవ్వాలి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి కేవలం ఒకరే ఉండాలని రాజ్యాంగం లో రూల్ లేదు. ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. గత ప్రభుత్వం లో అయితే ఏకంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇప్పుడు నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వెనుక పవన్ కళ్యాణ్ ని ఆ స్థానం నుండి తప్పించాలని వాళ్ళ ఉద్దేశ్యం కాదు. ఆయనతో సమానంగా మరో ఉప ముఖ్యమంత్రి గా లోకేష్ ని కూర్చోబెట్టాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్. నిన్న మొన్నటి వరకు కేవలం మీడియా, సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ అంశం, ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు లీడర్స్ రిక్వెస్ట్ చేసే వరకు వెళ్ళింది. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కి ఇంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు.
కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో కూర్చొని, ప్రజల పక్షాన నిలబడుతూ, అద్భుతంగా పరిపాలన అందిస్తుండడంతో ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ పెరిగింది. ఈ పదవి చేపట్టి ఆరు నెలల్లోనే పవన్ కళ్యాణ్ గ్రామసభలు నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోను రోడ్లను, అదే విధంగా ఆ గ్రామాల్లో ఉండే ఇతర సమస్యలను పరిష్కరించి సంచలనం సృష్టించాడు. అంతే కాకుండా రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన స్పందిస్తూ, దానిని పరిష్కరించే విధానాన్ని చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఒకమాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏకైక పవర్ సెంటర్ గా మారిపోతున్నారు. క్రెడిట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడికే వెళ్లిపోతున్నాయి, నారా లోకేష్ ని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆయన స్థాయి పెరిగేలా ఉపముఖ్యమంత్రి హోదాని ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మార్చి నెలలో పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రి వర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సమయంలో మంత్రి వర్గ కూర్పులో కొన్ని మార్పులు జరగొచ్చు అని అంటున్నారు, అప్పుడు ఏమి జరగబోతుందో చూడాలి.