Nidhi Agarwal : నిధి అగర్వాల్ చేసిన పని టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఆమె ప్రత్యేక పూజలు చేయించడం వివాదాస్పదమైంది. వేణు స్వామి హీరోయిన్ నిధితో కొన్ని పూజలు చేయించారు. తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి అంటే తెలియనివారు లేరు. ఈయన సెలెబ్రిటీ జ్యోతిష్కుడు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖుల జాతకాలు చూసి వాళ్ళ ఫేట్ ఏమిటో చెబుతూ ఉంటాడు. నాగ చైతన్య-సమంత విడాకుల విషయం ఈయన ముందే ఊహించాడు. అలాగే పలువురు సెలెబ్రిటీల జాతకాలు చూసి వాళ్ళ భవిష్యత్ చెప్పి వార్తలకు ఎక్కాడు.
ట్విస్ట్ ఏంటంటే ఈయన్ని టాలీవుడ్ సెలెబ్స్ చాలా మంది నమ్ముతారు. తమ కెరీర్ బాగుండాలని లక్షల రూపాయలు ఇచ్చి పూజలు చేయించుకుంటారు. గతంలో రష్మిక మందాన వేణు స్వామిని ఆశ్రయించింది. రష్మిక మందాన చేత ఆయన కొన్ని పూజలు చేయించాడు. ఆ దెబ్బతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిందట. తన ప్రియుడు రక్షిత్ శెట్టిని వదిలేసింది కూడా వేణు స్వామి సలహాతోనే అట. ఆమె ఇంకా కెరీర్లో హైట్స్ చూస్తారని. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళుతుందని చెప్పాడు.
ఈ క్రమంలో వేణు స్వామిని చాలా మంది నమ్ముతున్నారు. తాజాగా నిధి అగర్వాల్ ఆయనతో పూజలు చేయించింది. వేణు స్వామి రాజ శ్యామల, రాహు కేతు నివారణ పూజలు చేయించారట. ఇకపై నీ కెరీర్ జెట్ వేగంతో దూసుకుపోతుందని హామీ ఇచ్చారట. వేణు స్వామి మాటలతో నిధి అగర్వాల్ పిచ్చ హ్యాపీగా ఉన్నారట. నిధి ఇలాంటి విషయాలను బాగా నమ్ముతారు. టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్ అంతా నథింగ్… లక్ ఉన్నోళ్లే ఎదుగుతారని ఆమె ఓ సందర్భంలో అన్నారు.
నిధి మొదటి నుండి ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఆమె కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే భారీ హిట్ గా ఉంది. ఆ చిత్రం తర్వాత చేసినవన్నీ ఢమాల్ అన్నాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ కి జంటగా హరి హర వీరమల్లు మూవీ చేస్తుంది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ విజయం సాధిస్తే నిధి కెరీర్ సెట్ అయినట్లే. హరి హర వీరమల్లు చిత్రీకరణ జరుపుకుంటుంది.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Pawan heroines secret pooja with controversial swamiji an unexpected task to become a star
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com