https://oktelugu.com/

Naresh – Pavitra Lokesh: పవిత్ర లోకేష్ ఏంటీ ఇలా అయిపోయింది? ఏం చేశావ్ నరేష్?

Naresh – Pavitra Lokesh: నటులు నరేష్, పవిత్ర లోకేష్ ఏపీలో సందడి చేశారు. ఈ జంట పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడుకి విచ్చేశారు. స్థానిక అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. ఊరి ప్రధాన కూడలి లో ఉన్న సీతారామరాజు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. వీరి పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవిత్ర లోకేష్ లేటెస్ట్ లుక్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పవిత్ర లోకేష్ కి ఏమైందంటూ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 3, 2023 / 05:36 PM IST
    Follow us on

    Naresh – Pavitra Lokesh

    Naresh – Pavitra Lokesh: నటులు నరేష్, పవిత్ర లోకేష్ ఏపీలో సందడి చేశారు. ఈ జంట పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుపాడుకి విచ్చేశారు. స్థానిక అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. ఊరి ప్రధాన కూడలి లో ఉన్న సీతారామరాజు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. వీరి పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పవిత్ర లోకేష్ లేటెస్ట్ లుక్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పవిత్ర లోకేష్ కి ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    పవిత్ర లోకేష్ తన జుట్టు షార్ట్ గా చేశారు. గతంలో ఆమెకు అందమైన పొడవాటి జుట్టు ఉండేది. దాన్ని కురచగా కత్తిరించారు. ఆమె ఒకప్పటి సౌందర్యం కోల్పోయారనిపిస్తుంది. నరేష్ విగ్గులు వాడుతూ, క్లీన్ షేవింగ్ చేసి, కలర్ఫుల్ బట్టలతో యంగ్ గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. పవిత్ర ఏమో ఉన్న అందాన్ని కూడా తగ్గించుకుంటుంది. దీనికి కారణాలు ఏమిటో అంతుబట్టడం లేదు.

    Naresh – Pavitra Lokesh

    ఇటీవల నరేష్-పవిత్ర కొత్త మూవీ ప్రకటన చేశారు. ‘మళ్ళీ పెళ్లి’ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. సమ్మర్ కానుకగా విడుదల కానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ గ్లిమ్స్ విడుదల చేశారు. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం. పవిత్ర లోకేష్ మెడలో నరేష్ తాళి కడుతున్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. గతంలో పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకుంటానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా నాలుగో వివాహం చేసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి.

    అయితే పెళ్లి వీడియో ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం లోనిది అని స్పష్టత వచ్చింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వలేదు. ఆయన విడాకులు కావాలని పిటిషన్ వేశారు. అది కోర్టులో నడుస్తుంది. అది పవిత్రను వివాహం చేసుకునేందుకు అడ్డుగా మారింది. రమ్య రఘుపతి వాళ్ళ పెళ్లి జరగనీయను అంటూ శబధం చేస్తున్నారు. ఆ మధ్య నరేష్-రమ్య రఘుపతి ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. విడాకులు వద్దు నరేష్ కావాలని రమ్య రఘుపతి కోరడం కొసమెరుపు.