BheemlaNayak-First Glimpse: పవన్ లో ఈ రెండూ గమనించారా?

పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ బయటకు వచ్చింది. మల్టీస్టారర్ గా పవన్-రానా నటిస్తున్న చిత్రానికి పేరును ‘బీమ్లా నాయక్’గా పెట్టేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘గ్లింప్స్’ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసి చిత్రం యూనిట్ పవన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. ఈ గ్లింప్స్ గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ మూవీలో పవన్ కు ఇష్టమైన రెండు విషయాలను ఇందులో దర్శక నిర్మాతలు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ కు […]

Written By: NARESH, Updated On : August 15, 2021 11:27 am
Follow us on

పవర్ స్టార్ పవర్ ప్యాక్డ్ గ్లింప్స్ బయటకు వచ్చింది. మల్టీస్టారర్ గా పవన్-రానా నటిస్తున్న చిత్రానికి పేరును ‘బీమ్లా నాయక్’గా పెట్టేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘గ్లింప్స్’ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసి చిత్రం యూనిట్ పవన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది.

ఈ గ్లింప్స్ గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ మూవీలో పవన్ కు ఇష్టమైన రెండు విషయాలను ఇందులో దర్శక నిర్మాతలు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ కు ఆదిలాబాద్ గిరిజనులు అన్నా.. వారి సంస్కృతి సంప్రదాయాలు అన్న చాలా ఇష్టం. ఆయన ప్రతి సినిమాలోనూ ఆదిలాబాద్ కు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రస్తావిస్తుంటారు.

‘జల్సా’ మూవీలో ఆదిలాబాద్ గిరిజన యువకుడిగా తండా వాసిగా పవన్ కనిపించారు. పేరును కూడా గిరిజన యువకులు పెట్టుకునే ‘సంజయ్ సాహూ’ అని పెట్టుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఆదిలాబాద్ గిరిజన రైతు అయిన తన తండ్రి బలవన్మరణాన్ని చూపించారు.

ఇక ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’లోనూ హీరోయిన్ అనన్య ఆదిలాబాద్ గిరిజన తండా నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తున్నట్టు చూపించారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. పవన్ కు ఆదిలాబాద్ గిరిజనులపై ప్రేమ ఎక్కువ అందుకే తన లేటెస్ట్ మూవీ ‘అయ్యప్పమ్ కోషియమ్’ రిమేక్ కు ‘బీమ్లా నాయక్’ అని ఆదిలాబాద్ గిరిజనుల పేర్లే పెట్టుకోవడం విశేషం.

ఇక పవన్ కు ఇష్టమైనది మరోకటి లుంగీ లుక్. పవన్ లుంగీ కడితే పవన్ ఫ్యాన్స్ కు మాస్ జనాలకు పూనకాలే. అలాంటి లుక్ లోనే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి అభిమానులకు కన్నుల విందు చేశారు.ఎవరైనా టిప్ టాప్ లో ఫైట్ చేస్తారు. కానీ పవన్ చేసిన లుంగీ ఫైట్ మాత్రం ఇప్పుడు ‘బీమ్లా నాయక్’ ఫస్ట్ గ్లింప్స్ కు మరింత ఊపునిచ్చిందనే చెప్పాలి.

ఇలా పవన్ కు ఇష్టమైన రెండింటిని తాజాగా గ్లింప్స్ లో చూపించి జొప్పించి మేకర్స్ రిలీజ్ చేశారు. అది ఉర్రూతలూగించేలా ఉంది.