Pant Car Accident: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. పంత్ కారులో నుంచి దూకేయడంతోనే ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే అందులోనే సజీవ సమాధి అయి ఉండేవాడు. సరైన సమయంలో పంత్ చూపిన తెగువ అతడి ప్రాణాలు కాపాడింది. ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం అతడిని డెహ్రాడూన్ కు తరలించారు. ఆ సమయంలో కారులో ఒక్కడే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రయాణం చేస్తుండగా కారు ప్రమాదానికి గురికావడంతో సరైన సమయంలోనే ఆస్పత్రికి చేరవేశారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. పంత్ కారు ప్రమాదానికి గురైన తరువాత అతడి నగలు, డబ్బులు చోరీకి గురయ్యాయనే వాదనలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అతడి దగ్గర డబ్బు, నగదు ఉన్నట్లు చెబుతున్నారు. వాటిని కొందరు దొంగిలించినట్లు వార్తలు రావడం గమనార్హం. దీనిపై పంత్ ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశీల్ మాత్రం కారులో ఉన్న రూ.7 వేల నగదు అతడికే అప్పటించినట్లు వెల్లడించారు.
పంత్ దయనీయ స్థితిలో ఉండగా తామే బయటకు తీసి అంబులెన్స్ కు కాల్ చేశామని చెప్పాడు. పోలీసులకు కూడా సమాచారం చేరవేశామని పేర్కొన్నాడు. పంత్ అద్దాలు పగులగొట్టుకుని బయటకు రావడంతోనే త్వరగా కాపాడగలిగామని తెలిపాడు. పంత్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించడం వల్లే ప్రాణాలతో బయటకు వచ్చాడు. నిజమైన యోధుడిగా అభివర్ణిస్తున్నారు. కారు ప్రమాదాన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. బస్సులోంచి వచ్చిన ప్రయాణికుడు దుప్పటి కప్పడంతో మంటలు తగ్గాయి.

పంత్ కు గాయాలైన తరువాత కొందరు వచ్చి అతడి డబ్బు దోచుకెళ్లినట్లు వచ్చిన వార్తలు నిజం కావని సుశీల్ చెబుతున్నాడు. ప్రమాద సమయంలో తాను అక్కడే ఉన్నాను. అతడిని కాపాడి అంబులెన్సులో ఆస్పత్రికి పంపించే వరకు అక్కడే ఉన్నాను. కారులో ఉన్న రూ.7 వేల గురించి పంత్ చెబితే తీసి అతడికి ఇచ్చాను. బంగారం, నగదు దొంగిలించినట్లు వస్తున్న వార్తలు అపోహలే. అందులో వాస్తవం లేదు. పంత్ ఓ పక్క గాయాల పాలు అయితే ఇలాంటి వార్తలు బయటకు రావడం అందరిలో అనుమానాలకు తావిస్తుంది.