Babar Azam- Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకప్పుడు తన బ్యాట్ తోనే విమర్శకులకు సమాధానాలు చెప్పేవాడు. కొద్ది కాలంగా అతడి జోరు తగ్గింది. పరుగులు చేయడంలో వెనుకబడిపోతున్నాడు. అందరిచేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడం లేదు. ఏదో ఉన్నామా ఆడామా అనే ధోరణిలోనే కెరీర్ సాగిపోతోంది. సెలక్టర్లు సైతం అతడిని ఎంపిక చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఈ సీజన్ లోనైనా పరుగులు చేస్తాడా అనే ఆశతోనే ప్రతిసారి జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశమిస్తున్నా సద్వినియోగం చేసుకోవడం లేదు.

చెప్పుకోదగ్గ స్కోరు చేయడం లేదు. దీంతో అందరు కూడా కోహ్లి భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇదివరకే కపిల్ దేవ్ కోహ్లిని ఎందుకు జట్టు నుంచి తీయకూడదనే అనుమానం వ్యక్తం చేయడం చూస్తుంటే విరాట్ కోహ్లికి కష్టకాలమే ఎదురు కానుందని సమాచారం. కానీ అతడు బ్యాట్ ఝుళిపిస్తేనే అందరికి సమాధానం చెప్పినట్లు అవుతుందని భావిస్తే కోహ్లి మాత్రం తన బ్యాట్ కు పని చెప్పడం లేదు. దీంతో చిన్న స్కోరుకే పెవిలియన్ చేరుతున్నాడు. అందరి చేత విమర్శలే మూటగట్టుకుంటున్నాడు.
Also Read: Happy Birthday Collections: హ్యాపీ బర్త్ డే 6 డేస్ కలెక్షన్స్.. సేఫ్ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలి ?
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లికి తానున్నానని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మద్దతు తెలపడం సంచలనం కలిగిస్తోంది. హద్దులు దేశాలకే కాని ఆటగాళ్లకు కాదనే విషయం ఆజమ్ తీరుతో అర్థమవుతోంది. దీనిపై క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. విరాట్ కు మంచి భవిష్యత్ ఉందని భరోసా ఇస్తున్నాడు ఇప్పుడు ఏదో పరిస్థితులు బాలేక అలా ఆడుతున్నా త్వరలో అతడి ఆటలో మెరుపులు చూస్తామని ఆజమ్ ప్రకటించడం నెటిజన్లను సంతోషంలో ముంచుతోంది.

కోహ్లికి అనుకూలంగా ట్వీట్ చేయడంతో క్రీడాభిమానులు ఆజమ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రీడాస్ఫూర్తిని నిలువుటద్దంలా వ్యవహరిస్తున్న కెప్టెన్ బాబర్ ఆజమ్ కోహ్లికి అండగా నిలవడం నిజంగా స్ఫూర్తిదాయకమే. ఇలాంటి అండలు ఉంటే విరాట్ కొండలైనా దాటుతాడని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో ఆడే మ్యాచుల్లో విరాట్ తన ప్రతిభకు పదును పెట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేయడం నిజంగా అందరిలో ఆశ్చర్యాన్ని నింపుతోంది. దాయాది దేశాల క్రికెటర్లలో ఇలాంటి సహకారం ఉండటంతో క్రీడాలోకం కూడా అనుభూతికి లోనవుతోంది. కోహ్లి మరిన్ని విజయాలు నమోదు చేసి టీమిండియాలో ఓ ఆటగాడిగా వెలగాలని ఆశిద్దాం.
Also Read: Athma Sakshi Survey: ఆత్మసాక్షి సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?
[…] […]