
విలక్షణ యువ హీరో విశ్వక్ సేన్ మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు. ‘పాగల్’ అంటూ లవర్ కోసం పిచ్చోడు అయిపోయే యువకుడి పాత్రలో అలరించాడు. ‘ఫలక్ నుమా దాస్’, హిట్ సినిమాలతో వరుసగా టాలీవుడ్ లో మెరిసిన ఈ మాస్ హీరో తాజాగా ‘పాగల్’ చిత్రంలో మనముందుకు వస్తున్నాడు. నరేశ్ కొప్పల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజ్ సమర్పణలో లక్కీ మీడియా నిర్మించింది.
Also Read: జబర్దస్త్ ఆర్టిస్టుకు ఎన్టీఆర్ దండం.. వైరల్ అవుతున్న వీడియో!
వేసవి కానుకగా ఏప్రిల్ 30న విడుదలయ్యే ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. తాజాగా ‘పాగల్’ ట్రైలర్ లో హీరో విశ్వక్ సేన్ ప్రేమ కోసం పాగల్ అయ్యే ఆవేశపరుడైన యువకుడి పాత్రలో కనిపించాడు.
ఎవరు కనపడితే వారికి.. ఆఖరుకు ముసలోళ్లకు కూడా ఐలవ్ యూ చెప్తూ బామ్మను కూడా వదలకుండా ప్రపోజ్ చేసిన లవర్ గా కనిపించారు. ప్రియురాలి ఆనందం కోసం దెబ్బలు తినే పాత్రనూ పోషించాడు.
Also Read: సక్సెస్ మీట్: ఉప్పెన టాలీవుడ్ కు ఊపు తెచ్చిందన్న రాంచరణ్
ప్రేమలో పడితే ప్రతి ఒక్కడూ పాగల్ గాడే అనే థీమ్ తో ఈ సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. రథన్ సంగీతం అందిస్తోంది. మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, సిమ్రాన్ చౌదరి ఇతర కథానాయకులు.
ఈ చిత్రం ట్రైలర్ ను కింద చూడొచ్చు.

Comments are closed.