
ఒక మహిళ ఒకటి కాదు రెండు కాదు గత 25 సంవత్సరాలుగా దగ్గు సమస్యతో బాధ పడుతోంది. దగ్గు నుంచి ఉపశమనం కొరకు మహిళ ఎన్నో మందులను ఉపయోగించింది. కానీ ఎన్ని మందులు వాడినా దగ్గు నుంచి ఉపశమనం లభించలేదు. దగ్గు తగ్గకపోవడంతో మహిళ పరీక్షలు చేయించుకోగా గొంతులో విజిల్ ఉందని గుర్తించిన వైద్యులు ఆపరేషన్ చేసి విజిల్ ను తొలగించి దగ్గు సమస్య నుంచి పరిష్కారం చూపించారు.
Also Read: జీడిపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
పూర్తి వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా మట్లన్పూర్ లో నివశిస్తున్న మహిళ వయస్సు ప్రస్తుతం 45 సంవత్సరాలు. దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న మహిళ చలికాలంలో దగ్గుతో మరింత ఇబ్బంది పడేది. సమస్య తీవ్రం కావడంతో కన్నూరు ప్రభుత్వాసుపత్రి లో జాఫర్ భాష అనే డాక్టర్ ను కలిసి మహిళ సమస్యను వివరించింది. పరీక్షల్లో మహిళ శ్వాస నాళంలో చిన్నపాటి ప్లాస్టిక్ విజిల్ ఉన్నట్టు తేలింది.
Also Read: మందులతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం సాధ్యమేనా..?
వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ప్రియరామ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు పంపించారు. ఆ ఆస్పత్రిలో జాఫర్ భాష, మరి కొంతమంది వైద్యులతో కలిసి విజిల్ ను తొలగించారు. 20 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో తాను విజిల్ మింగి ఉండవచ్చని ఆమె భావిస్తున్నారు. వైద్యుల కృషితో 25 సంవత్సరాల నుంచి మహిళ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభించింది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
వైద్యులు ఎవరైనా నెలల తరబడి దగ్గు సమస్యతో బాధ పడుతూ ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.