Nithiin Thammudu Movie G: ‘రాబిన్ హుడ్’ లాంటి దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత హీరో నితిన్(Actor Nithin) నటించిన ‘తమ్ముడు'(Thammudu Movie) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తగా గ్రాండ్ లెవెల్ లో విడుదలైంది. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో ఈ చిత్రం లో కచ్చితంగా ఎదో విషయం ఉంది, డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) ఎదో కొత్త ప్రయత్నం చేశాడు అని అంతా అనుకున్నారు. కానీ విడుదల తర్వాత ఈ చిత్రం కనీస స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు థియేటర్ లో కూర్చున్నంత సేపు ‘ఎప్పుడుడెప్పుడు ఈ సినిమా అయిపోతుందా..ఎప్పుడు బయటకి వెల్దామా’ అని అనుకున్నారట. ఆ రేంజ్ లో ఉందని తెల్లవారుజామునే ఓవర్సీస్ నుండి టాక్ వచ్చేసింది. ఆ టాక్ ప్రభావం సినిమా ఓపెనింగ్ వసూళ్లపై మామూలు రేంజ్ లో పడలేదు. బుక్ మై షో యాప్ లో పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.
హైదరాబాద్ సిటీ లో అయితే బుక్ మై షో యాప్ లో ఈ చిత్రం కనీసం టాప్ 10 ట్రెండ్స్ లో కూడా లేదు. ఇంతటి దారుణమైన రెస్పాన్స్ ‘రాబిన్ హుడ్’ చిత్రానికి కూడా రాలేదు. ప్రస్తుతానికి బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇంతటి దారుణమైన డిజాస్టర్ టాక్ లో ఈ మాత్రం టికెట్ సేల్స్ ఉండడం పర్లేదు అనుకోవచ్చు. కానీ ఓవరాల్ ఓపెనింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమాని దిల్ రాజు దాదాపుగా 75 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇందులో 30 కోట్ల రూపాయలకు పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 30 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. కానీ థియేట్రికల్ షేర్స్ దారుణం నుండి అతి దారుణంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
నితిన్ గత చిత్రం ‘రాబిన్ హుడ్’ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో 7 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక తమ్ముడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ అయినా వస్తుందా లేదా అని అనుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ ఏడాది ప్రారంభం లో ‘గేమ్ చేంజర్’ చిత్రం తో చావుదెబ్బ తిన్న దిల్ రాజు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో నాలుగు రోజుల్లోనే కం బ్యాక్ ఇచ్చాడు. ఇక అన్ని మంచి ప్రాజెక్ట్స్ తగులుతాయని ఆశించిన ఆయనకు ‘తమ్ముడు’ మూవీ రూపం లో కోలుకోలేని షాక్ తగిలింది. దీనిపై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.