Shalini : ఓయ్ మూవీ హీరోయిన్ ఇంత హాట్ గా తయారు అయ్యిందేంటి! చూస్తే తట్టుకోలేరు

బాలనటులుగా చిన్నతనం లో సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.అలా బాలనటిగా చిన్నతనం లో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన నటి బేబీ షామిలీ.మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రాజు రాజు అంటూ ఎంతో క్యూట్ గా పిలుస్తూ మాట్లాడే ఈ చిన్నారికి చైల్డ్ ఆర్టిస్టు గా ఉన్న క్రేజ్ మామూలుది కాదు. పాన్ ఇండియన్ లెవెల్ […]

Written By: NARESH, Updated On : February 19, 2023 9:52 pm
Follow us on

బాలనటులుగా చిన్నతనం లో సూపర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చెయ్యడం అంటే సాధారణమైన విషయం కాదు.అలా బాలనటిగా చిన్నతనం లో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన నటి బేబీ షామిలీ.మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రాజు రాజు అంటూ ఎంతో క్యూట్ గా పిలుస్తూ మాట్లాడే ఈ చిన్నారికి చైల్డ్ ఆర్టిస్టు గా ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

పాన్ ఇండియన్ లెవెల్ లో చిన్నతనం లో ఈమె అన్ని ప్రాంతీయ బాషా చిత్రాలలో నటించేసింది.అలా దాదాపుగా 50 సినిమాలకు పైగా చేసిన బేబీ షామిలి అక్క మరియు అన్నయ్య కూడా బాలనటులుగా పలు సినిమాల్లో నటించారు.అక్కపేరు షాలిని మరియు అన్నయ్య పేరు రిషి రిచర్డ్.షాలిని తమిళ ఇండస్ట్రీ లో టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి ప్రముఖ స్టార్ హీరో అజిత్ ని పెళ్లాడింది.ఈ విషయం అందరికీ తెలిసిందే.

అన్నయ్య రిషి రిచర్డ్ కూడా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి చాలా సినిమాల్లో హీరో గా నటించాడు.వాటిల్లో కొన్ని హిట్స్ అయ్యాయి కూడా, కానీ ఎందుకో మిగిలిన స్టార్ హీరోల రేంజ్ లో ఆయన సక్సెస్ కాలేకపోయాడు.ఇక బేబీ షామిలి పెరిగి పెద్దైన తర్వాత ప్రముఖ హీరో సిద్దార్థ్ తో కలిసి ‘ఓయ్’ అనే చిత్రం లో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, షామిలి కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.కానీ లుక్స్ పరంగా చిన్నప్పుడు ఉన్నంత క్యూట్ గా లేదే, బాగా లావుగా ఉంది అంటూ ఆరోజుల్లో చాలా కామెంట్స్ వినిపించాయి.ఆ కారణం చేతనే ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు పెద్దగా రాలేదు.

ఇక ఆ తర్వాత సుమారుగా 7 ఏళ్ళు విరామం తీసుకొని బాగా సన్నగా అయ్యి మళ్ళీ ఇండస్ట్రీ లోకి వచ్చింది.కానీ అప్పటికే ఇండస్ట్రీ లో కుర్ర హీరోయిన్స్ అడుగుపెట్టి భారీ హిట్స్ కొట్టి నాటుకుపోవడం, రీ ఎంట్రీ తర్వాత షామిలి చేసిన మూడు సినిమాలు సక్సెస్ కాకపోవడం తో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.అయితే సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ వచ్చే షామిలీ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.