
IND vs AUS : బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో ఇండియా దూకుడు ప్రదర్శిస్తోంది..నాగ్ పూర్ లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిస్తే…ఢిల్లీలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.. సమిష్టిగా రాణిస్తున్న ఇండియా పై ప్రశంసల జల్లు కురుస్తుండగా… స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి భారత బౌలర్లకు చిక్కిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 62/1 తో పటిష్ట స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా…మూడో రోజు తొలి సెషన్ లో చాప చుట్టేసింది. లబు షేన్, స్మిత్ వంటి వారు ఉన్నప్పటికీ కూడా 113 పరుగులకే ఆల్ ఔట్ అయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఔట్ అయిన విధానం పట్ల మాజీ ఆటగాళ్లు ఫైర్ అవుతున్నారు. దినేష్ కార్తీక్, మాథ్యూ హేడెన్ అయితే ఆసీస్ బ్యాటర్ల షాట్ సెలక్షన్ ను తప్పు పడుతున్నారు. అసలు బుర్ర ఉండే అలాంటి షాట్లు ఎంపిక చేసుకున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంతి తక్కువ ఎత్తు వస్తున్న ఇలాంటి మైదానా ల పై ప్రతి బంతిని స్వీప్ చేయాలి అని చూడటం తప్పని డీకే అభిప్రాయ పడ్డాడు. ఇక హేడెన్ కూడా డీకే తో అంగీకరించాడు. క్రీజు లోకి ముందుకొచ్చి ఆడటం పట్ల కూడా పెదవి విరిచాడు. బంతి వస్తున్న లైన్ మీదకే ఆడాలి. లైన్ అసలు దాట కూడదు. అని హితవు పలికాడు. భారత్ పై ఎదురు దాడి చేయాలి అనుకున్నపుడు క్రీజు లో పాతుకు పోవాలి..కానీ ఆసీస్ ఆటగాళ్లకు అదే చేత కాలేదు..దాన్ని చూసి జడ్డూ వాళ్ళను బుట్ట లో వేసుకున్నాడు.
ఇలాంటి మైదానం పై ఒక పద్దతి ప్రకారం ఆడాలి అని డీకే సూచించాడు. తక్కువ ఎత్తులో బంతి వస్తున్నప్పుడు ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇవ్వాళా ఆసీస్ కూడా అలానే భంగపడింది అని అభిప్రాయపడ్డాడు. “తక్కువ ఎత్తులో వస్తున్న ప్రతి బంతిని స్వీప్ షాట్ ఆడేందుకు అసలు ప్రయత్నించకూడదు. మన బ్యాట్ పొదిలో ఉండాల్సిన షాట్ అది. దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి.. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్ళు అనవసరంగా తొందరపడ్డారు.. ఇండియన్ బౌలర్లను కంగారుపెట్టాలని దూకుడు ప్రదర్శించారు.. కానీ వారే కంగారు పడ్డారు..” అని డీకే వివరించాడు.
నిన్న దాటిగా ఆడిన హెడ్… ఈరోజుకు వచ్చేసరికి తేలిపోయాడు.. మిగతా బ్యాట్స్మెన్ తమకు ఏదో పని ఉందన్నట్టుగా డ్రెస్సింగ్ రూమ్ కు క్యూ కట్టారు..ఇలా ఆడితే ఎలా అని హేడెన్ వాపోయాడు.. “కొంతమంది తమ డిఫెన్స్ ను వాళ్లే నమ్మలేదు.. భారీ షాట్లతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. అలా చేయాలని డ్రెస్సింగ్ రూమ్ లోనే ప్లాన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. క్రీ జు లోకి దిగిన తర్వాత పరిస్థితిని అంచనా వేసుకొని, దానికి తగ్గట్టు ఆడాలి. బ్యాటింగ్ ప్లాన్ ఉండటం మంచిదే.. కానీ పరిస్థితికి తగ్గట్టు పాటలు మార్చుకుంటూ ఉండాలి.” అని డీకే వ్యాఖ్యానించగా… దీనికి హెడెన్ మద్దతు తెలిపాడు.