
Kartheeka Deepam : తెలుగు సీరియల్స్ లో కార్తీక దీపం రారాజుగా వెలిగిపోయింది. ఆ సీరియల్ టీఆర్పీ ఇండియన్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ మధ్య కాలంలో ఏ సీరియల్ కి దక్కనంత వ్యూవర్షిప్ కార్తీక దీపం సీరియల్ కి దక్కింది. 2017లో మొదలైన కార్తీకదీపం నిరవధికంగా ఏళ్ల తరబడి సాగింది. ఇటీవల 2023 జనవరిలో ముగిసింది. ఇక ఈ సీరియల్ లో పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. వంటలక్క, డాక్టర్ బాబు అనగానే కార్తీక దీపం సీరియల్ అనేంతగా ప్రేక్షకులు తయారయ్యారు. ఈ రెండు పాత్రలపై సినిమాల్లో కూడా స్పూఫ్స్, కామెడీ సెటైర్స్ రూపొందాయి.
ముఖ్యంగా వంటలక్క పాత్రకు లక్షల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క/దీప పాత్ర చేసిన నటి పేరు ప్రేమీ విశ్వనాథ్. తన సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకుల అభిమాన నటి అయ్యారు. మలయాళీ అయిన ప్రేమీ విశ్వనాథ్ తెలుగులో ఇంతటి పాపులారిటీ తెచ్చుకోవడం నిజంగా గొప్ప విశేషం. అయితే ప్రేమీ విశ్వనాథ్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ న్యూస్ ఆమె అభిమానుల గుండెలు బరువెక్కేలా చేస్తుంది.
ప్రేమీ విశ్వనాథ్ అరుదైన వ్యాధి బారినపడ్డారట. ఆమెకు స్కిన్ అలర్జీ సమస్యలు తలెత్తాయట. ముఖం మీద మచ్చలు ఏర్పడ్డాయట. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటున్నారట. ప్రేమీ విశ్వనాథ్ వంటలక్క పాత్ర కోసం నలుపు మేకప్ వేసుకునేవారు. సహజంగా ఉండే ఆమె కలర్ కనిపించకుండా పాత్రలో భాగంగా నల్లగా తయారయ్యేవారు. దీని కోసం హెవీగా మేకప్ వేసుకోవాల్సి వచ్చేది. ఇదే ఆమె స్కిన్ సమస్యకు దారి తీసిందని సమాచారం.
ప్రేమీ విశ్వనాథ్ కి అనారోగ్యమని తెలిసి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా ఈ సమస్య నుండి కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రేమీ విశ్వనాథ్ కేరళకు చెందిన నటి. ఆమెకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయట. ప్రేమీ విశ్వనాథ్ కి ఒక స్టూడియో కూడా ఉందని అక్కడ షూటింగ్స్ జరుగుతాయనే వాదన కూడా ఉంది. మలయాళంలో పలు సినిమాలు, సీరియల్స్ లో ఆమె నటించారు. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న కస్టడీ చిత్రంలో ప్రేమీ విశ్వనాథ్ నటిస్తున్నట్లు సమాచారం. అలాగే కార్తీక దీపం 2 ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. అది జరిగితే వంటలక్క ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేనట్లే.