Viral Photo:ఈ మధ్య సోషల్ మీడియాలో ఫజిల్ లు.. కనిపెట్టే ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కంటికి కనిపించి కనిపించని ఫొటోలు ఎన్నో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో కనిపెట్టే విషయాలకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కోసారి చాలా ఆలోచించాల్సి వస్తుంది.

ఫొటోని ఎక్కువ సార్లు గమనిస్తే తప్పించి మీరు అందులో ఏముందో తెలుసుకోవడం కష్టమే. ఇప్పుడు అలాంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ కంటి చూపు ఎలా ఉందో ఈ ఫొటోతో తెలుసుకోవచ్చు.
ఈ చిత్రం చూస్తే అందులో ఓ ముసాలయన వ్యక్తి ఫొటో కనిపిస్తోంది. అదో స్కెచ్. మరింత జాగ్రత్తగా పరిశీలిస్తేనే అందులోని విషయం అర్థమవుతుంది. అందులో రాసి ఉన్న ఒక పదం LIAR అని తెలుస్తుంది.ఈ పదాన్ని గుర్తించడానికి తలని కుడివైపు వంచాలి. కళ్లు, ముక్కు L రూపంలో ఉంటాయి. ముక్కు I వలె గీసారు. పెదవులు A రూపాన్ని తెలుపుతున్నాయి. గడ్డం నుంచి గొంతు వరకూ R రూపాలను సూచిస్తున్నాయి.
ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ చిత్రం 1600 కంటే ఎక్కువ లైక్ లను పొందింది. ఈ పిక్చర్ లో దాగిఉన్నదాన్ని ఇప్పటివరకూ ఎవ్వరూ గుర్తించలేకపోయారు. మరికొందరూ ఎవ్వరూ అలా తల పక్కకు తిప్పుకొని చూడరని ఎద్దేవా చేస్తున్నారు.