Ram charan : రాంచరణ్ ఎదుగుదలను ఒప్పుకోలేకున్నది ఎవరు..? ఆయన కీర్తి మనది కాదా!

Ram charan : ఇంతింతై వటుడింతై అన్నట్లు రాంచరణ్ కీర్తి పతాకం ఎవరెస్ట్ కి చేరింది. ప్రపంచ సినిమా వేదికగా చెప్పుకునే అమెరికాలో ఆయన ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో చరణ్ ఇండియన్ హీరో రేంజ్ నుండి గ్లోబల్ స్టార్ రేంజ్ కి వెళ్లారు. రోజుల వ్యవధిలో అరుదైన గౌరవాలు అందుకున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి అతిథిగా ఆహ్వానించబడ్డారు. ఈ గౌరవం అందుకున్న ఫస్ట్ ఇండియన్ హీరోగా రికార్డులకు ఎక్కారు. హాలీవుడ్ […]

Written By: NARESH, Updated On : February 25, 2023 5:33 pm
Follow us on

Ram charan : ఇంతింతై వటుడింతై అన్నట్లు రాంచరణ్ కీర్తి పతాకం ఎవరెస్ట్ కి చేరింది. ప్రపంచ సినిమా వేదికగా చెప్పుకునే అమెరికాలో ఆయన ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో చరణ్ ఇండియన్ హీరో రేంజ్ నుండి గ్లోబల్ స్టార్ రేంజ్ కి వెళ్లారు. రోజుల వ్యవధిలో అరుదైన గౌరవాలు అందుకున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి అతిథిగా ఆహ్వానించబడ్డారు. ఈ గౌరవం అందుకున్న ఫస్ట్ ఇండియన్ హీరోగా రికార్డులకు ఎక్కారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్స్ వేడుకకు హాజరయ్యారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ రామ్ చరణ్ ని స్పాట్ లైట్ అవార్డుకు ఎంపిక చేసింది.

క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు.బెస్ట్ యాక్షన్ హీరోస్ విభాగంలో రామ్ చరణ్ నామినేట్ కావడం జరిగింది. ఎన్టీఆర్ సైతం ఈ కేటగిరీలో నామినేట్ అయ్యారు. రామ్ చరణ్… ఈ అవార్డు కోసం టామ్ క్రూజ్, నికోలస్ కేజ్, బ్రాడ్ ఫిట్ వంటి హాలీవుడ్ సూపర్ స్టార్స్ తో తలపడనున్నారు. ఇండియన్ మీడియా చరణ్ గొప్పతనాన్ని, ఆయన సాధించిన విజయాల గురించి ప్రముఖంగా రాస్తుంది.

అయితే టాలీవుడ్ మీడియా కావాలని బహిష్కరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ అమెరికా వెళ్ళాక అనేక అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏ ఇండియన్ హీరో చేరుకోలేని లక్ష్యాలు సాధించారు. అమెరికా ఆయన్ని ప్రత్యేకంగా చూస్తుంది. అమెరికన్ ఆడియన్స్ రామ్ చరణ్ ఈజ్ గ్రేట్ అంటున్నారు. హాలీవుడ్ స్టార్స్ ప్రముఖంగా ఆయన గురించి ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో తెలుగు మీడియాలోని ఒక వర్గం చరణ్ విజయాలను జీర్ణించుకోలేకుంది. ఉద్దేశపూర్వకంగా చరణ్ వార్తలను అవైడ్ చేస్తున్నారు.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ అందుకుంటున్న రాంచరణ్

రాజకీయ పార్టీల విషయంలో కనిపించే పక్షపాతం సినిమాకు దాపురించింది. కుల వివక్ష ఇక్కడ కూడా కనిపిస్తుంది. మావాడన్న నటుడి గురించి ఆవగింజంత విషయాన్ని తాటికాయంత చేసి రాస్తారు. అదే సమయంలో మనవాడు కాదనుకుంటే ఆ హీరో అరుదైన విజయాల గురించి కనీస కవర్ చేయరు. రామ్ చరణ్ విషయంలో అదే జరుగుతుంది. రామ్ చరణ్ అంతర్జాతీయ విజయాలను రాయకపోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది. చరణ్ గ్రేట్ అంటే, మరొక హీరోని తగ్గించడమే అని వారి భావన.

అయితే సోషల్ మీడియా యుగంలో వారి మూస ఆలోచనలు పని చేయవు. రాకెట్ వేగంతో ఎలాంటి వార్త అయినా అందరికీ క్షణాల్లో చేరిపోతుంది. చరణ్ కీర్తి దాచాలనుకోవడం అరచేత్తో సూర్యుడి వెలుగును అడ్డగించడమే అవుతుంది. అందుకే రామ్ చరణ్ ఫ్యాన్స్, సాధారణ సినిమా జనాలు ఓ వర్గం బెరుకు తనాన్ని,ఈర్ష్యను ట్రోల్ చేస్తున్నారు. చరణ్ వరల్డ్ సినిమా ఈవెంట్స్ లో చూపిస్తున్న హుందాతనం… మెచ్యూరిటీ కొనియాడుతున్నారు.

ఆర్ ఆర్ ఆర్ విజయం సమిష్టి కృషిగా చరణ్ అభివర్ణిస్తున్నారు. ఇండియా సినిమాకు గొప్ప ప్రతినిధిగా ఆయన అవతరించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ గుణం బహుశా తండ్రి చిరంజీవి నుండి సంక్రమించిందేమో. మౌన మహర్షిలా విజయాలకు పొంగిపోకుండా తన టీమ్ ని, ఇండియన్ సినిమా గొప్పతనం వివరిస్తూ ఉన్నత విలువలు చాటుకుంటున్నారు. అలాంటి రామ్ చరణ్ ఉన్నతిని ఎదుగుదలను అంగీకరించలేని మీడియా ప్రతినిధులు, సినిమా వర్గాలు జీవచ్ఛవాలతో సమానం!