
Y. V. S. Chowdary: నందమూరి తారకరామారావు వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వ్యక్తి YVS చౌదరి.గుడివాడ ప్రాంతం నుండి ఇండస్ట్రీ కి వచ్చిన ఈయన ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ తో కలిసి అప్పట్లో సినిమా అవకాశాల కోసం స్టూడియోస్ చుట్టును ప్రదక్షిణలు చేసే వారు.ఒక ఎడిటర్ నరసింహ రావు YVS చౌదరి ని గుర్తించి తనకి అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు.ఆ తర్వాత ఈయన కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.కలియుగ పాండవులు, సహస సామ్రాట్, దొంగ రాముడు, జానకి రాముడు, రుద్రనేత్ర మరియు జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.ఇతనిలో టాలెంట్ ని గుర్తించిన అక్కినేని నాగార్జున, చౌదరి కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు.
నాగార్జున నిర్మాతగా మారి చౌదరి ని ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో చౌదరికి టాలీవుడ్ లో 26 మంది బడా నిర్మాతల నుండి ఆఫర్స్ వచ్చాయి.కానీ ఆయన తన రెండవ చిత్రం కూడా అక్కినేని నాగార్జున నిర్మాణం లోనే చేసాడు.అక్కినేని నాగార్జున మరియు నందమూరి హరికృష్ణ ని పెట్టి ‘సీతారామరాజు’ అనే చిత్రం చేసాడు.ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది,ఆ తర్వాత మహేష్ తో చేసిన ‘యువరాజు’ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఆ తర్వాత ఆయనే నిర్మాతగా మారి ‘బొమ్మరిల్లు ఆర్ట్స్’ అనే సంస్థ ని ప్రారంభించి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే సినిమా తీసాడు.ఇది అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యి చౌదరి కి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యేలా చేసింది.
ఇక ఆ తర్వాత కూడా ఆయన తెరకెక్కించే సినిమాలను తన నిర్మాణ సారథ్యం లోనే తెరకెక్కించాడు.అలా మళ్ళీ ఆయన ‘సీతయ్య’, ‘దేవదాస్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు.అక్కడి వరకు YVS చౌదరి కెరీర్ బ్రహ్మాండంగా సాగింది.కానీ ఎప్పుడైతే బాలయ్య తో ‘ఒక్క మగాడు’ అనే సినిమా తీసాడో అప్పటి నుండి ఈయనకి కష్టాలు మొదలయ్యాయి.అప్పట్లో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై కనీసం వారం రోజులు కూడా ఆడలేకపోయింది.ఆ తర్వాత మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు తో కలిసి ‘సలీం’ అనే చిత్రం చేసాడు.ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యింది, ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు YVS చౌదరి కి కనీసం రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు.

దీనితో చౌదరి కోర్టు లో పోరాడి మోహన్ బాబు నుండి డబ్బులు రప్పించుకొని రవితేజ ని హీరో గా పెట్టి నిప్పు అనే సినిమాని నిర్మించింది.ఈ నిప్పు చిత్రం ఆర్థికంగా చౌదరి కెరీర్ ని నాశనం చేసేసింది.ఇక ఆ తర్వాత ఆయన సాయి ధరమ్ తేజ్ తో ‘రేయ్’ అనే చిత్రం చేసాడు.ఇది డిజాస్టర్ కా బాప్ అవ్వడం తో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు.ఈ డైరెక్టర్ ఆర్ధిక పరిస్థితి కూడా బాగాలేదని టాక్.మరి సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.