https://oktelugu.com/

Omicron: ఒమిక్రాన్ బయట ఎన్ని గంటలు బతికి ఉంటుందో తెలుసా?

Omicron: ప్రపంచాన్ని గుప్పిట పట్టి వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎందుకు ఇంతగా యాక్టివ్ అనేది తేలిపోయింది. తాజాగా జపాన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ మన పర్యావరణాన్ని తట్టుకొని అత్యధిక కాలం జీవిస్తోందని తేలింది. గతంలో వచ్చిన అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేగం ఎక్కువ. మనుషుల్లో ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ ఎన్ని గంటలు పర్యావరణంలో జీవించి ఉంటుందనే దానిపై జపాన్ కు చెందిన పరిశోధకులు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2022 / 09:16 PM IST
    Follow us on

    Omicron: ప్రపంచాన్ని గుప్పిట పట్టి వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎందుకు ఇంతగా యాక్టివ్ అనేది తేలిపోయింది. తాజాగా జపాన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ మన పర్యావరణాన్ని తట్టుకొని అత్యధిక కాలం జీవిస్తోందని తేలింది.

    Omicron

    గతంలో వచ్చిన అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేగం ఎక్కువ. మనుషుల్లో ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ ఎన్ని గంటలు పర్యావరణంలో జీవించి ఉంటుందనే దానిపై జపాన్ కు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.

    మనిషి చర్మంపై ఒమిక్రాన్ వేరియంట్ ఏకంగా 21 గంటల పాటు సజీవంగా ఉంటుందని.. అదే ప్లాస్టిక్ ఉపరితలంపై ఏకంగా 8 రోజుల పాటు జీవించి ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం ఇదేనని తెలిపారు.

    గతంలో వచ్చిన ఆల్ఫా, బీటా, డెల్టా, కంటే ఒమిక్రాన్ వేరియంట్ రెండు రెట్లు కన్నా అధికంగా చర్మం, ప్లాస్టిక్ పై జీవించగలదని తేలింది. అత్యధిక పర్యావరణ స్థిరాత్వాన్ని కలిగి ఉండడం వల్లే ఈ వేరియంట్లతో ఎక్కువ వ్యాప్తి జరుగుతున్నట్లు తేలింది.

    అన్ని వేరియంట్ల కంటే కూడా ఒమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని పరిశోధనలో తేలింది. అందుకే డెల్టా రకంతో పోలిస్తే శరవేగంగా ఇది వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.