HBD Shurti Haasan: లోక నాయకుడు.. దేశం గర్వించే గొప్ప నటుడు కమల్ హాసన్ కడుపున పుట్టిన కూతురు శృతిహాసన్. తండ్రికి తగ్గ తనయగా నటనలో నిరూపించుకుంది. దక్షిణాది, ఉత్తరాదిన తనకంటూ ప్రఖ్యాత గుర్తింపును తెచ్చుకుంది. తన సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దక్షిణాదిన పలువురు స్టార్ హీరోలతో నటించింది. 1986 జనవరి 28న పుట్టిన శృతిహాసన్ తాజాగా 36వ పుట్టినరోజును జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా శృతిహాసన్ కు ‘ఓకే తెలుగు.కామ్’ తరుఫున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆమె సినీ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం..

-శృతి హాసన్ బాల్యం, విద్యాభ్యాసం
1986 జనవరి 28న తమిళనాడులోని చెన్నైలో అగ్రహీరో కమల్ హాసన్-సారిక దంపతులకు శృతిహాసన్ జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరు నటులు కావడం చేత చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. ఆ తర్వాత సారికతో కమల్ హాసన్ విడిపోయారు. ప్రస్తుతం తండ్రితోపాటే శృతి ఉంటోంది. 2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హే రాం’ సినిమాలో బాల్యనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతిహాసన్ ఆ తర్వాత సంగీతంపై శ్రద్ధ చూపింది.
2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్’ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఆ సినిమా ఘెర పరాజయాన్ని చవిచూసింది. శృతి నటన బాగాలేదంటూ విమర్శలు చవిచూడాల్సి వచ్చింది.
2011లో కే. రాఘవేంద్రరావు కొడుకు అయిన కే. ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ సరసన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటనకు శృతికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోవడంతో అవకాశాలు రాలేదు. ఈ సినిమాలో నటనకు ఫిలింఫేర్ అవార్డ్ కూడా లభించింది.

ఇదే సంవత్సరంలో ‘దిల్ తో బచ్చాహై జీ’ సినిమాలో అతిథిపాత్రలో నటించింది శృతి. ఆపై ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో ‘7th సెన్స్’ మూవీతో బ్రేక్ తెచ్చుకుంది. శృతికి ఈ సినిమాతో నటనకు గుర్తింపు లభించడమేకాకుండా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు పొందింది.
ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ‘ఓమై ఫ్రెండ్’, చిరంజీవితో ‘ఇద్దరు మిత్రులు’తో పేరు తెచ్చుకుంది. ధనుష్ తో ‘3’, పవన్ కళ్యాన్ సరసన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. ‘ఎవడు’, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు సినిమాలో శృతి కెరీర్ పతాకస్థాయికి చేరింది. తర్వాత ‘బలుపు’, రామయ్యా వస్తావయ్యా చేసింది. హిందీలోనూ ‘రామయ్యా వస్తావయ్యా’, ఢీ-డే సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. ఇటీవల 2021లో వచ్చిన రవితేజ ‘క్రాక్’ సినిమాలో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా తండ్రి పంచిన నటవారసత్వాన్ని శృతి హాసన్ కొనసాగించింది. తండ్రికి తగ్గ తనయగా నటనలో నిరూపించుకుంది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈ భామ ఇటీవల ప్రియుడితో బ్రేకప్ చేసుకొని ఒంటరిగా ఉంటున్నట్టు తెలిసింది. ప్రేమ మైకంలో తేలియాడుతూ మధ్యలో సినిమాలు చేస్తూ చెన్నైకి దూరంగా ఉంటోందట.. మొత్తంగా జనవరి 28 పుట్టినరోజు సందర్భంగా శృతిహాసన్ కు మనమూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం..
[…] Anasuya Bharadwaj: అనసూయ మరో వివాదంలో చిక్కుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ బూతులు తిడుతున్నారు. ఇంతకీ అనసూయ ఏమి చేసింది అంటే.. రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ వందేమాతరం గీతాన్ని కూర్చొని ఆలపించింది. దీనిపై నెటిజన్లు ‘పాటను పాడేటప్పుడు ఎందుకు నిల్చోలేదు. టీ షర్ట్ పై గాందీ బొమ్మ ఎందుకు ధరించావ్’ అని కామెంట్ చేశారు. […]
[…] Ileana: ఫేడ్ అవుట్ హీరోయిన్ల వ్యవహార శైలి నిజంగా విచ్చలవిడితనం తో ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ లో ఆటుపోట్లు ఎదుర్కొని.. మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని విశ్వప్రయత్నాలు చేసే హీరోయిన్లు చాలా రకాలుగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోవా సుందరి ఇలియానా పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే.. నో నా రేంజ్ బాలీవుడ్ అంటూ గొప్పలు పోయిన ఈ బ్యూటీ చివరకు తెలుగు చిన్నాచితకా హీరోలతో కూడా రొమాన్స్ కి సిద్దం అంటుంది. […]