https://oktelugu.com/

Megastar Chiranjeevi Childhood Photo: మెగా స్టార్ చిరంజీవి చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా?

Old Man Shared Megastar Chiranjeevi Childhood Memories : మెగాస్టార్ ఆ పేరు ఉంటేనే ఒక ఊపు.. చిరంజీవి అంటే టాలీవుడ్ కు పెద్ద దిక్కు. అయితే మెగాస్టార్ ఈ రేంజ్ కు ఒక్కసారిగా ఏం ఎదగలేదు. ఆయన ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. ఒక మామూలు హెడ్ కానిస్టేబుల్ కుటుంబంలో పెద్ద కుమారుడిగా పుట్టిన చిరంజీవి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అనంతరం విలన్ గా.. హీరోగా ఇలా అంచలంచెలుగా ఎదిగారు. కానీ చిన్నప్పుడు అందరి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 11, 2022 / 02:18 PM IST

    Megastar Chiranjeevi Childhood Photo

    Follow us on

    Old Man Shared Megastar Chiranjeevi Childhood Memories : మెగాస్టార్ ఆ పేరు ఉంటేనే ఒక ఊపు.. చిరంజీవి అంటే టాలీవుడ్ కు పెద్ద దిక్కు. అయితే మెగాస్టార్ ఈ రేంజ్ కు ఒక్కసారిగా ఏం ఎదగలేదు. ఆయన ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. ఒక మామూలు హెడ్ కానిస్టేబుల్ కుటుంబంలో పెద్ద కుమారుడిగా పుట్టిన చిరంజీవి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అనంతరం విలన్ గా.. హీరోగా ఇలా అంచలంచెలుగా ఎదిగారు.

    కానీ చిన్నప్పుడు అందరి లాగానే ఒక మధ్య తరగతి కుటుంబంలో చిరంజీవి పుట్టాడు. సాధారణ విద్యార్థిలా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాడు. చిరంజీవితో పాటు చదువుకున్న ఒకపెద్దాయన తాజాగా ఒక అరుదైన ఫొటోను బయటపెట్టాడు.

    Also Read: Rajamouli: నార్త్ వాళ్ళ పొగరు అణిచిన రాజమౌళి!

    చిరంజీవి క్లాస్ మేట్ ఒకతను తాజాగా జనసేన నాయకులు ఇంటింటి ప్రచారంలో భాగంగా తిరుగుతుండగా కంటపడ్డాడు. చిరంజీవి తన క్లాస్ మేట్ అని.. 40 ఏళ్ల క్రితం దిగిన ఫొటోను బయటపెట్టాడు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.

    ఆ గ్రూప్ ఫొటో చిరంజీవి డిగ్రీ చదువుతున్న రోజుల్లో తీయించుకున్నది. ఆ ఫొటోను చిరంజీవి స్నేహితుడు ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాడు. జనసేన నేతలు రాగా చూపించాడు. వాళ్లు ఆ ఫొటోలో చిరంజీవిని చూసి ఇప్పటి గ్రేస్ అప్పుడు కూడా ఉందంటూ అదే స్టైల్ అదే లుక్ లో ఉన్నాడని మురిసిపోయారు.

    Also Read: Vikram Second Week Collections: రూ. 300 కోట్ల దిశగా విక్రమ్… రెండో వారం కూడా తగ్గని కమల్ జోరు!

    చిరంజీవి అప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫొటోను జనసైనికులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిన్నప్పుడు చిరంజీవి ఇలా ఉన్నాడంటూ మురిసిపోతున్నారు.