New Name For KCR: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేరును ఆయన తనయుడు తెలంగాణ ముఖ్యమైన మంత్రి మార్చేశారు. కొత్తగా కేసీఆర్ అర్థం వచ్చేలా
కే అంటే కాలువలు..,
సీ అంటే చెరువులు..,
ఆర్ అంటే రిజర్వాయర్లు.. అని కేసీఆర్ పేరుకు అర్థం చెప్పారు కేటీఆర్.
Also Read: KCR New Party: టీఆర్‌ఎస్‌కు బైబై.. బీఆర్‌ఎస్‌కు జై!.. కొత్త పార్టీ స్థాపనకే కేసీఆర్ మొగ్గు!
రాష్ట్రం అంతా జపిస్తుందని..
ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టడానికి మూడు నెలలు తర్జనభర్జన పడిన ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు శనివారం ఖమ్మంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి నిరసనలు ఎదురు కాకుండా పోలీసులు ముందుగానే విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లకే వెళ్లిన సమయంలో రైతుసంఘం నాయకుడు కేటీఆర్ కారుపై చెప్పు విసిరారు. దీంతో ఖమ్మం పోలీసులు, టీఆర్‌ఎస్ నాయకులు మరింత అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఖమ్మంలో అడుగుపెట్టిన కేసీఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగ కేసీఆర్ పేరుకు కొత్త అర్థం చెప్పారు కేటీఆర్.
పువ్వాడకు క్లీన్‌చిట్..
బీజేపీ యువ నాయకుడు ఆత్మహత్యకు కారకుడైన ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కి తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఖమ్మం అభివృద్ధి ప్రదాతగా పువ్వాడను సభావేదికగా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం ఎలా ఉండేది, తెలంగాణ వచ్చాక ఎలా అభివృద్ధి చెందిందో అలోచించాలని సూచించారు. ఇదే సమయంలో బీజేపీ యువ నాయకుడి ఆత్మహత్యకు మంత్రి పువ్వాడ కారణమని మరణ వాగ్మూలం కూడా ఇచ్చారు. అయినా పువ్వాడకు కేటీఆర్ క్లీన్‌చిట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కర్నాటక రాష్ట్రంలో ఓ కాంట్రాక్టర్ మంత్రి పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుంటే ఆ మంత్రి స్వయంగా పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. స్వయంగా పువ్వాడనే రాజీనామా చేయాల్సి ఉండగా అది జరుగలేదు. నాలుగు నెలల తర్వాత జిల్లాకు వచ్చిన కేటీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడంలో ఆంతర ్యం ఏమిటన్న చర్చ జరుగుతోంది.