OG : కళ్ళు జిగేలుమనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ‘#OG’ ఓవర్సీస్ రైట్స్..చరిత్రలో ఇదే తొలిసారి

OG : రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది.క్రేజ్ అనే పదం ఎత్తితే చిన్నపిల్లవాడు కూడా పవన్ కళ్యాణ్ పేరే చెప్తాడు.తెలుగు ప్రజల్లో గుండెల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది.అయితే ఫ్యాన్స్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తన రేంజ్ కి తగ్గ సినిమాలు చెయ్యడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు. స్టార్ డైరెక్టర్స్ తో పవన్ కళ్యాణ్ పని చేసేది చాలా తక్కువ, కేవలం తన మాస్ […]

Written By: Vicky, Updated On : ఏప్రిల్ 16, 2023 8:33 ఉద.
Follow us on

OG : రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది.క్రేజ్ అనే పదం ఎత్తితే చిన్నపిల్లవాడు కూడా పవన్ కళ్యాణ్ పేరే చెప్తాడు.తెలుగు ప్రజల్లో గుండెల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది.అయితే ఫ్యాన్స్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తన రేంజ్ కి తగ్గ సినిమాలు చెయ్యడం లేదని ఫీల్ అవుతూ ఉంటారు.

స్టార్ డైరెక్టర్స్ తో పవన్ కళ్యాణ్ పని చేసేది చాలా తక్కువ, కేవలం తన మాస్ ఇమేజి మీదనే సినిమాకి హైప్ తెస్తాడు, ఎవరికీ సాధ్యం కానీ ఓపెనింగ్స్ పెడుతాడు అని అంటుంటారు.అయితే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ సినిమా పడబోతోంది.ఆ చిత్రం పేరే #OG ,కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ నేడే ముంబై లో ప్రారంభం అయ్యింది.

అందుకు సంబంధించి ఒక కాన్సెప్ట్ వీడియో ని ఈరోజు టీం విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇలాగే కదా మేము పవన్ కళ్యాణ్ ని చూడాలనుకుంది అంటూ అభిమానులు ఆనందం తో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ చిత్రం తో పవన్ కళ్యాణ్ కేవలం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని మాత్రమే కాదు,ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొడుతాడంటూ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు.

వాళ్ళు ఆ ఊపు లో ఉన్నప్పుడే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో బయటపడింది.ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ 5 మిలియన్ డాలర్స్ కి అమ్ముపోయిందట.ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా నలభై కోట్ల రూపాయిలు అన్నమాట.ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే జరిగిందట.పవన్ కళ్యాణ్ ఒక సరైన సినిమా తీస్తే ఆయన రేంజ్ ఇది అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

Tags