https://oktelugu.com/

Odisha: పింఛన్ కోసం ఎంత కష్టం: ఈ వృద్ధురాలిని చూస్తే కన్నీరు రాక మానదు

Odisha: మన దేశం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దూసుకెళ్తోంది. ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. పాలకులు చెబుతున్న ముచ్చట్లు ఇలానే ఉంటాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. రోడ్లు లేని పల్లెలు, కరెంటు ముఖం చూడని గ్రామాలు, పౌష్టికాహార లోపంతో చనిపోయే చిన్నారులు, పలక బలపం పట్టకుండా పనికి వెళ్లే పిల్లలు..ఇలాంటి దృశ్యాలు నేటికీ కనిపిస్తున్నాయి. అభాగ్యుల బాధలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక పండు టాకుల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయినవారి […]

Written By:
  • Rocky
  • , Updated On : April 21, 2023 2:46 pm
    Follow us on

    Odisha

    Odisha: మన దేశం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు దూసుకెళ్తోంది. ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. పాలకులు చెబుతున్న ముచ్చట్లు ఇలానే ఉంటాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇలా ఉండదు. రోడ్లు లేని పల్లెలు, కరెంటు ముఖం చూడని గ్రామాలు, పౌష్టికాహార లోపంతో చనిపోయే చిన్నారులు, పలక బలపం పట్టకుండా పనికి వెళ్లే పిల్లలు..ఇలాంటి దృశ్యాలు నేటికీ కనిపిస్తున్నాయి. అభాగ్యుల బాధలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక పండు టాకుల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయినవారి ఆదరణ లేక, శరీరం సహకరించక, ముమ్మరించిన రోగాల మధ్య వారి జీవనం దిన దిన గండమే. అందుకే గత కొద్ది సంవత్సరాలుగా వృద్ధాశ్రమాల సంఖ్య దేశంలో భారీగా పెరుగుతోంది. అయితే అందరికీ వృద్ధాశ్రమాల్లో చేరే అవకాశం ఉండటం లేదు. ఇక మారుమూల గ్రామాల్లో ఉన్న వృద్ధుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంటుంది. అందుకు ఈ మహిళ దుస్థితే ఓ ఉదాహరణ.

    ఒడిశా రాష్ట్రంలో ఝరి గావ్ ప్రాంతానికి చెందిన సూర్య హరిజన్ ఓ వృద్ధురాలు. వయసు 70 కి పైనే ఉంటుంది. భర్త చనిపోయాడు. పిల్లలు ఉన్నప్పటికీ ఎవరి దారి వారిదే. దారిద్రరేఖకు దిగువ కుటుంబం కావడంతో ప్రభుత్వం నెలనెలా పింఛన్ ఇస్తోంది. అయితే ఇక్కడే ఒక షరతు ఉంది. ప్రతినెలా ఇచ్చే ఆ పింఛన్ కోసం బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి ఐరిష్ మిషన్లో వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ వేలిముద్ర సరిపోలితేనే బ్యాంక్ అధికారులు పింఛన్ ఇస్తారు. లేకుంటే అంతే సంగతులు. స్థానికంగా ఉన్న గ్రామ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం ఇస్తే బ్యాంకు అధికారులు దయ చూపుతారు. ఇక ఆ గ్రామ కార్యదర్శి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే పదో పాతికో ముట్ట చెప్పాలి. ఇలాంటి ప్రయాస పడలేక పింఛన్ వదులుకునే పండుటాకులు ఎంతోమంది. అయితే ఇలాంటి వారి బాధలు దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను నియమించింది. కానీ మిగతా రాష్ట్రంలో చొరవలేదు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని కచ్చితంగా అభినందించాల్సిందే..

    ఇక సూర్య హరిజన్ విషయానికి వస్తే ఆమె చేతి వేళ్ళు విరిగాయి. ప్రతినెలా వచ్చే పింఛన్ మాత్రమే ఆమెకు ఆసరా. ఆ డబ్బుల కోసం ప్రతి నెల బ్యాంకుకు వెళ్తుంది. అసలే మారుమూల గ్రామం కావడంతో రవాణా సౌకర్యం అంతంత మాత్రమే. స్థానికంగా ఉన్న బ్యాంకు దగ్గరికి విరిగిన కుర్చీ సహాయంతో దానిని ఆసరాగా చేసుకుని నడుచుకుంటూ వెళ్తుంటుంది. అలా బ్యాంకుకు వెళ్లి పింఛన్ తీసుకుంటుంది. ఆమె చేతి వేలు విరగడంతో పింఛన్ తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. అయితే పింఛన్ కోసం ఆ వృద్ధురాలు పడుతున్న బాధను ఓ నెటిజన్ వీడియో తీసి సామాజిక మద్యమాల్లో పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.

    Odisha

    చాలామంది ఈ వీడియోని చూసి కన్నీరు కార్చారు. ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఇదే సమయంలో ఈ వీడియోను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ట్విట్టర్ ఐడి కి ట్యాగ్ చేశారు. కొంత మంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ట్యాగ్ చేశారు. “ఇదీ మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ పని తీరు, ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటిని ఆమె వాడలేదు. బ్యాంకు అధికారులు వేలిముద్రలు లేవని పింఛన్ ఇవ్వరు. ఇలాంటి వృద్ధులు ఏం చేయాలని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. మరో వైపు సదరు వృద్ధురాలి సమస్యపై స్థానిక ఎస్బిఐ మేనేజర్ స్పందించారు. “ఆమెకు చేతి వేలు సరిగా లేనందున ముద్రలు పడటం లేదు. త్వరలో ఆమె సమస్యకు పరిష్కారం చూపుతామని” ప్రకటించారు.

    Tags