Homeఎంటర్టైన్మెంట్Balakrishna- NTR: బాలయ్య చేసిన తప్పుతో ఎన్టీఆర్‌కు స్టార్‌ ఇమేజ్‌..!

Balakrishna- NTR: బాలయ్య చేసిన తప్పుతో ఎన్టీఆర్‌కు స్టార్‌ ఇమేజ్‌..!

Balakrishna- NTR
Balakrishna- NTR

Balakrishna- NTR: టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఒకేసారి ఆస్కార్‌ అవార్డుల్లో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫొటోలు వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంతగా ఎదగడం వెనుక బాలయ్య చేసిన ఒక చిన్న తప్పు ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలయ్య మొదటి నుంచి మాస్‌ సినిమాలకు పెట్టింది పేరు. పవర్‌ ఫుల్‌ పాత్రలలో ఎక్కువగా నటిస్తూ ఉండేవారు. బాలయ్యను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో పాత్రలను చేసేవారు రచయితలు. ఈ క్రమంలోని అప్పట్లో స్టార్‌ రైటర్‌గా ఉన్న విజయేంద్రప్రసాద్‌ ఒక అద్భుతమైన కథను కూడా రాశారు. అది కూడా బాలయ్యను దృష్టిలో పెట్టుకొని.. ఈ సినిమా కథను రాసినట్లు తెలుస్తోంది. బాలయ్యతో సినిమా చేయాలని కోరికతో ఆ కథను బాలయ్య దగ్గరకు బి.గోపాల్‌ తీసుకువెళ్లాడు. కానీ వీరిద్దరూ అప్పటికే వేరే చిత్రంలో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి నో చెప్పారట.

Balakrishna- NTR
Balakrishna- NTR

జూనియర్‌ ఎన్టీఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌..
బాలయ్య తిరస్కరించిన స్టోరీనే జూనియర్‌ ఎన్టీఆర్‌తో రాజమౌళి తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు. ఆ సినమానే సింహాద్రి. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ కోసం స్టోరీలో విజయేంద్రప్రసాద్‌ కొన్ని మార్పులు చేశారట. ఒకవేళ రాజమౌళి ఈ కథను ఎన్టీఆర్‌ వద్దకు తీసుకు వెళ్లకుండా ఉంటే.. ఎన్టీఆర్‌ ఇంతటి పాపులర్‌ అయ్యే వారు కాదని చెప్పవచ్చు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పలు రికార్డులను సైతం సృష్టించింది.

ఎన్టీఆర్‌కి అతి చిన్న వయసులోని తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ తెచ్చింది సింహాద్రి. దీంతో ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా మారిపోయారు ఒకవేళ ఈ సినిమాని బాలయ్య చేసి ఉంటే ఎన్టీఆర్‌ అంత త్వరగా స్టార్‌ హీరో అయ్యేవారు కాదేమో.. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్‌ గా మారుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version