
NTR30 : నందమూరి తారకరామరావు.. సీనియర్ అయినా జూనియర్ అయినా ఈ ఇద్దరు నందమూరి వారసులు ఒక తరాన్ని ఏలుతున్నారు. టాలీవుడ్ ఆది పురుషుడు సీనియర్ ఎన్టీఆర్ అయితే.. ఇప్పుడు మూల పురుషుల్లో జూ.ఎన్టీఆర్ ఒకడిగా ఎదుగుతున్నాడు.
అయితే ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరు ఎన్టీఆర్ లు ఓ అందమైన హీరోయిన్లతో కలిసి నటించారు. సీనియర్ ఎన్టీఆర్ తన ఎన్నో సినిమాల్లో అతిలోక సుందరి శ్రీదేవితో ఆడిపాడాడు. ఇప్పుడు ఆమె కూతురు జాన్వి కపూర్ తో ఎన్టీఆర్ మనవడు జూనియర్ జతకట్టాడు. ఈ అరుదైన దృష్యం ‘ఎన్టీఆర్30’ మూవీ లాంచ్ సందర్భంగా చోటు చేసుకుంది.
న్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్లో జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. శారీలో ఈవెంట్ కి హాజరైన జాన్వీ కపూర్ అందరితో ముచ్చటించారు. ఎన్టీఆర్ ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జాన్వి చేతిలో చేయి వేసి మరీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నందుకు థాంక్స్ చెప్పారు. దీనికి ఇట్స్ మై ప్లేషర్ అంటూ జాన్వి చెప్పుకొచ్చింది.
ఇక వేడుకకు హాజరైన రాజమౌళి ప్రత్యేకంగా జాన్వీతో కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. గతంలో రాజమౌళి శ్రీదేవితో కలిసి పనిచేయాలనుకున్నారు. బాహుబలి మూవీలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర కోసం మొదట అనుకుంది శ్రీదేవినే. భవిష్యత్ లో ఆమె వారసురాలు జాన్వీతో రాజమౌళి మూవీ చేసే అవకాశం కలదు. మహేష్ సినిమాకు బహుశా జాన్వీని ఎంపిక చేయవచ్చని అనుకుంటున్నారు.