
Junior NTR: తాత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఇక కెరీర్ బిగినింగ్ నుండి తాతను అనుకరిస్తూ వస్తున్నాడు ఆయన. సీనియర్ ఎన్టీఆర్ డాన్సులు, హావభావాలు సిల్వర్ స్క్రీన్ మీద జూనియర్ ఎన్టీఆర్ ట్రై చేశారు. ఆ విధంగా నందమూరి అభిమానులకు, రామారావు భక్తులకు దగ్గర కావాలనేది ఆయన ప్రణాళిక కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాదని ఆయన మీద సొంత కుటుంబ సభ్యులే కుట్ర పన్నినట్లు వాదనలు ఉన్నాయి. ఎన్టీఆర్ అభివృద్ధిని బాలయ్య జీర్ణించుకోలేకపోయాడనే కథనాలు వెలువడ్డాయి.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మొదటి నుండి తాతయ్యకు సిసలైన వారసుడిగా ప్రచారమయ్యాడు. ఆయన రూపు, మాటతీరు కుటుంబంలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే వచ్చాయనే నమ్మకం కుదిరింది. అయితే ఎన్టీఆర్ ఒక స్థాయికి రావడంలో ఆయన టాలెంట్ ఖచ్చితంగా ఉంది. ఈ జనరేషన్స్ స్టార్స్ లో గొప్ప డాన్సర్ గా ఆయన అవతరించారు. ఇక తాతయ్య వారసుడిగా నిరూపించుకునే క్రమంలో ఆయన చేసిన ఐకానిక్ రోల్స్ తన చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ట్రై చేశారు.

యమదొంగ మూవీలో యముడి పాత్రలో కనిపించి అలరించిన ఎన్టీఆర్… దాన వీర శూర కర్ణ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్ యమదొంగ నేపధ్యానికి తగ్గట్టు మార్చి చెప్పి, ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నారు. అనంతరం రామయ్యా వస్తావయ్యా మూవీలో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో దుర్యోధనుడు గెటప్ వేశారు. కాలేజ్ కల్చరల్స్ కోసం దుర్యోధన పాత్ర ప్రాక్టీస్ చేసే సీన్స్లో ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్ పూర్తిగా చెప్పి మెప్పించాడు.
కొంచెం కట్ అవుట్ తగ్గినా దుర్యోధనుడు పాత్రలో ఎన్టీఆర్ కట్టిపడేసారు. తాతయ్యను గుర్తు చేశారు. కాగా ఈ ఐకానిక్ గెటప్ లో ఎన్టీఆర్ నేరుగా ఇంటికి వెళ్ళాడట. ఎన్టీఆర్ గెటప్ చూసిన భార్య లక్ష్మి ప్రణతి, తల్లి షాలిని షాక్ అయ్యారట. సర్ప్రైజ్ అనంతరం వారితో ఎన్టీఆర్ ఓ ఫోటో దిగారు. సదరు పాత ఫోటో ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. అభిమానులు మా హీరో ఏ పాత్రలో అయినా అద్భుతం చేస్తాడంటూ… కాలర్ ఎగరేస్తున్నారు.
కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ తన లేటెస్ట్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
View this post on Instagram