https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్‌ను దారుణంగా మోసం చేసిన మహిళ.. హైకోర్టుకు యంగ్‌ టైగర్‌ !

జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని గీత అనే మహిళ వద్ద 2003లో కొనుగోలు చేశాడు.చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. తాజాగా ఈ స్థలంపై వివాదం చెలరేగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 17, 2024 / 01:34 PM IST

    NTR

    Follow us on

    NTR: సామాన్యులను మోసం చేయడం, బురిడీ కొట్టించడం తరచూ చూస్తుంటా. ఆన్‌లైన్‌ మోసాలు కూడా ఎక్కువగా జరుగున్న వార్తలు పత్రికలు, టీవీల్లో వస్తున్నాయి. సామాన్యులకు తెలియక ఎక్కువగా మోసపోతున్నారు. నమ్మితే సామాన్యులనే కాదు సెలబ్రిటీలను కూడా మోసానికి గురికాక తప్పదు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక స్థలం కొనుగోలు విషయంలో మోసపోయారు. జూబ్లీహిల్స్‌లో ఒక స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు.

    స్థలం కొనుగోలు చేసి..
    జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలాన్ని గీత అనే మహిళ వద్ద 2003లో కొనుగోలు చేశాడు.చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది అదే ఏడాది ఇంటి నిర్మాణం కూడా చేపట్టారు. తాజాగా ఈ స్థలంపై వివాదం చెలరేగింది.

    బ్యాంకులో తనఖా..
    అయితే ఈ స్థలాన్ని గీత గతంలోనే బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకుంది. రుణం చెల్లిచకపోవడంతో బ్యాంకు అధికారులు స్థలంలో ఇల్లు కట్టుకున్న జూనియర ఎన్టీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. సదరు స్థలాన్ని గీత 1996 తనఖా పెట్టినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకులు నోటీసుల్లో పేర్కొన్నాయి. సర్ఫేసీ యాక్ట్‌ కింద డెబ్ట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.

    ప్రాపర్టీ రికవరీకి..
    ప్రాపర్టీని బ్యాంకులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ వ్యవహారంలో దీనిపై పోలీసులు ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు. అయితే డెబ్ట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఎన్టీఆర్‌కు షాక్‌ ఇచ్చింది.

    హైకోర్టును ఆశ్రయించిన నటుడు..
    వ్యతిరేకంగా ఆర్డర్‌ రావడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. పిటీషన్‌లో తాను 2003లో సుంకు గీత నుంచి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాడు. అయితే ఆమె 1996 లోనే ఆ స్థలం బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందినట్లు పలు బ్యాంకులు రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయని పేర్కొన్నారు. సుంకు గీతపై కేసు నమోదుకు డెబ్ట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై కూడా ఎన్టీఆర్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.