Balakrishna : బాలకృష్ణ పెళ్ళికి హాజరుకాని ఎన్టీఆర్, హరికృష్ణ.. కారణం అదేనా..!

Balakrishna’s wedding : నందమూరి నటసింహంగా, ఎన్టీఆర్ సినీ వారసుడుగా సినిమా రంగంలో అద్వితీయమైన నటనతో అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ వివాహానికి సంబంధించిన ఒక విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలకృష్ణ పెళ్లి రోజు తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ లేకపోవడంపై అప్పట్లో పెద్ద చర్చే సాగింది. అయితే, దీనిపై చాలామందికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం తెలియదు. అసలు బాలకృష్ణకు పెళ్లి ఎవరి కుదిర్చారు, ఆ పెళ్లికి ఎన్టీఆర్ హరికృష్ణ ఎందుకు రాలేదు ఒకసారి చూసేద్దాం. తెలుగు […]

Written By: NARESH, Updated On : March 26, 2023 10:08 pm
Follow us on

Balakrishna’s wedding : నందమూరి నటసింహంగా, ఎన్టీఆర్ సినీ వారసుడుగా సినిమా రంగంలో అద్వితీయమైన నటనతో అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ వివాహానికి సంబంధించిన ఒక విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలకృష్ణ పెళ్లి రోజు తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ లేకపోవడంపై అప్పట్లో పెద్ద చర్చే సాగింది. అయితే, దీనిపై చాలామందికి ఇప్పటికీ స్పష్టమైన సమాధానం తెలియదు. అసలు బాలకృష్ణకు పెళ్లి ఎవరి కుదిర్చారు, ఆ పెళ్లికి ఎన్టీఆర్ హరికృష్ణ ఎందుకు రాలేదు ఒకసారి చూసేద్దాం.

తెలుగు సినీ చరిత్రలో తనకొంటూ కొన్ని ప్రత్యేక పేజీలు రాసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో తన అద్భుతమైన నటనతో అందరినీ అలరించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు కూడా సంపాదించుకున్నారు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక ప్రేమకథ సినిమాలో నటించి తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగంలోకి..

సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఎక్కువగా తండ్రి సినిమాల్లోనే నటించేవారు. అనంతరం తండ్రి ప్రోత్సాహంతో, తన నటన కౌశలంతో హీరోగా రాణించాడు బాలకృష్ణ. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికీ అగ్ర నటుడుగా వెలుగొందుతున్నారు. విభిన్నమైన పాత్రలతో కోట్లాదిమంది అభిమానులను బాలకృష్ణ అలరిస్తున్నారు. వయసు పెరుగుతున్న తనలోని నటుడిని మేల్కొలుపుతూ విభిన్నమైన పాత్రలను ఇప్పటికీ చేస్తూ తన సత్తాను చాటుతున్నారు.

వసుంధరతో బాలకృష్ణ వివాహం..

ఇక బాలకృష్ణకి వసుంధర దేవితో పెళ్లి అయిన సంగతి మనకు తెలిసిందే. కానీ బాలకృష్ణ పెళ్ళికి మాత్రం సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ రాలేదు. అయితే, బాలకృష్ణకు వసుంధర దేవి అనే అమ్మాయితో సీనియర్ ఎన్టీఆర్ పెళ్లి నిశ్చయం చేశారు. ఇక వసుంధర దేవిని రామోజీరావు ఇంట్లో చూసిన సీనియర్ ఎన్టీఆర్ నా ఇంటికి కోడలుగా ఈమెనే కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి రామోజీరావు ద్వారా తన తల్లిదండ్రులకు చెప్పి వసుంధర దేవిని బాలకృష్ణ ఇచ్చి పెళ్లి చేశారు.

అందుకే హాజరు కాలేదు..

అయితే, బాలకృష్ణ – వసుంధర దేవిల వివాహానికి సీనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీనిపైన అనేక రకాలుగా చర్చలు సాగాయి. అయితే, దీని వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు. అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. అంతేకాదు తెలుగుదశం పార్టీ ప్రచారంలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరు బిజీగా ఉండడం వల్ల బాలకృష్ణ పెళ్ళికి రాలేకపోయారు. ఇక బాలకృష్ణ పెళ్లి పెద్దగా రామోజీరావు దగ్గరుండి వారి పెళ్లి చేయించారు.