Swag Trailer: విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీసి ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇవ్వాలని కోరుకునే హీరోలలో ఒకరు శ్రీ విష్ణు. క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత హీరో గా మారి హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా విభిన్నమైన ఆలోచనలతో స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. రీసెంట్ గానే ‘సామజవరగమనా’, ‘ఓం భీం బుష్’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చిన శ్రీవిష్ణు, ఇప్పుడు ‘స్వాగ్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం హసిత్ గోలి అనే నూతన దర్శకుడి దర్శకత్వం లో తెరకెక్కింది. సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించగా రీతూ వర్మ, దక్ష నాగర్కర్ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. 1551 వ సంవత్సరం నుండి వర్తమాన కాలం వరకు ప్రయాణించిన ఒక మగవాడి కథగా ఈ చిత్రం తెరకెక్కింది.
స్వాగనిక వంశానికి చెందిన రాజుగా ఇందులో శ్రీవిష్ణు కనిపించాడు. ఆ వంశానికి సంబంధించిన నిధి చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ ని చూస్తే అర్థం అయిపోతుంది. ఇందులో హీరోయిన్ రీతూ వర్మ నెగటివ్ రోల్ లో నటించింది . సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కూడా చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్రతో మన ముందుకు వచ్చినట్టు ఈ ట్రైలర్ ని చూసినప్పుడు అనిపించింది. ఇక కమెడియన్ సునీల్ మరోసారి తనలోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీసాడు. మొత్తం మీద ఈ ట్రైలర్ ని చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ తో పాటు విభిన్నమైన స్టోరీ టెల్లింగ్ తో డైరెక్టర్ హసిత్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. శ్రీ విష్ణు కి కూడా హ్యాట్రిక్ హిట్ కచ్చితంగా పడేలా ఉంది. అక్టోబర్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో మూవీ టీం ఫుల్ బిజీ గా ఉంది. సినిమా విజయం పట్ల శ్రీ విష్ణు చాలా బలమైన నమ్మకం తో ఉన్నాడు.
ముఖ్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కి ఈ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే ఆయన తీసిన లేటెస్ట్ చిత్రాలు ‘ఈగల్’, ‘మనమే’, ‘మిస్టర్ బచ్చన్’ వంటివి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు ఈ బ్యానర్ ‘స్వాగ్’ చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కనీసం 70 ఏళ్ళు కూడా బ్రతకలేకపోతున్న ఒక మనిషి, ఏకంగా 400 సంవత్సరాలకు పైగా ఎలా బ్రతికాడు?, ఆ పాత్ర వంశ వృక్షం ఏమిటి?, అన్ని రోజులు కనిపించకుండా పోయిన హీరో ఇప్పుడు మళ్ళీ తన వంశాన్ని వెతుక్కుంటూ రావడానికి గల కారణం ఏమిటి అనేది తెలియాలంటే అక్టోబర్ 4 వరకు ఆగాల్సిందే.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More