Noida: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలామంది ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వారికి అటు సినిమాల్లో, ఇంకా బయట చాలా అవకాశాలు వస్తాయి. దండిగా సంపాదించుకునేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. అందుకోసమే చాలామంది చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేసి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఫేమస్ కావాలని భావిస్తున్నారు. అయితే అందులో చాలామంది ఫేమస్ కాకపోగా.. జనాల నుంచి తిట్లు తింటున్నారు. నెటిజన్ల నుంచి చీత్కరింపులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో హోలీ సందర్భంగా ఇలాంటి సంఘటననే జరిగింది.
ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో ఇటీవల మెట్రో రైల్ లో కొంతమంది ఇద్దరు యువతులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. మెట్రో రైల్ లో హోలీ వేడుకలు జరుపుకోవడమే పెద్ద తప్పు. పైగా వారు ఆ రంగులు పూసుకునే విధానం అత్యంత దారుణంగా ఉంది. చుట్టూ జనాలు చూస్తున్నారనే సోయి లేకుండా లె**** లాగా వ్యవహరించారు. వారి వాలకం చూసిన తోటి ప్రయాణికులకు అలాగే అనిపించింది. ఈ వ్యవహారం మెట్రో అధికారులకు తెలియడంతో ఆ యువతులను మందలించి వదిలేశారు. ఆ మరుసటి రోజు హోలీ వేడుకల్లో భాగంగా ఆ ఇద్దరి యువతులు దారుణంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తి బైక్ నడుపుకుంటే.. ఇద్దరు ఒకరికి ఎదురుగా మరొకరు కూర్చొని రంగులు పూసుకుని.. ఆ లింగనం చేసుకుని.. ఎక్కడెక్కడో తడుముకుంటూ దారుణంగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దాన్ని మర్చిపోకముందే ఢిల్లీలోని అదే ప్రాంతంలో మరో ఘటన జరిగింది.
హోలీ సందర్భంగా తన స్నేహితుడికి రంగు పూసేందుకు ఓ యువతీ వినూత్న శైలి అనుసరించింది.. తన స్నేహితుడు బైక్ నడుపుతుండగా.. అతడి వెనకాల నిల్చొని.. బుగ్గల కు రంగు పూసే ప్రయత్నం చేసింది. అలా వెనుక నిలిచే క్రమంలో బ్యాలెన్స్ తప్పి ఆ యువతి కింద పడిపోయింది. దీంతో ఆమెకు దెబ్బలు తగిలాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..
ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆ యువతిని తిడుతున్నారు. హోలీ సందర్భంగా ఇదేం పనంటూ విమర్శిస్తున్నారు. కాగా, ఢిల్లీ మెట్రోలో రంగులు పూసుకుంటూ చండాలమైన పని చేసిన యువతులను, ఈ యువతి ని కలిపి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఢిల్లీ మెట్రో, బైక్ పై వికృత కార్యకలాపాలకు పాల్పడిన యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది.
⚡VIRAL | Couple in Noida, Uttar Pradesh recently desired to plan a special Holi celebration. The pair entered the street on a scooter. It was the man on the bike. The girl was enjoying herself while standing.#Noida #HoliCelebration#NoidaPolice pic.twitter.com/LWltIpveTo
— tikhna.drishti (@DrishtiTikhna) March 25, 2024