MLC Kavitha: కల్వకుంట్ల కవితకు భారీ షాక్!

రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని ఈడీ ఆఫీస్‌లోనే విచారణ చేసింది. తాజాగా మరోమారు కస్టడీ కావాలని కోర్టు కోరింది. కానీ, ఈడీ ముందుగా కవితకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Written By: Raj Shekar, Updated On : March 26, 2024 1:45 pm

MLC Kavitha

Follow us on

MLC Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్‌ అనెన్యూ కోర్టు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో కవితను తిహార్‌ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముగిసిన ఈడీ కస్టడీ..
ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ మార్చి 16న అరెస్టు చేసింది. అదే రోజున ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి సాయంత్రం 5:20 గంటలకు అరెస్టు చేశారు. రాత్రి 8:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. 17వ తేదీన ఉదయం ఈడీ ప్రత్యేక కోరుట్లో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్‌ విధించింది. అయితే వెంటనే ఈడీ కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేసింది. పది రోజుల కస్టడీ కోరగా ఏడు రోజులు మాత్రమే ఇచ్చింది. దీంతో మార్చి 23న కోర్టులో హాజరు పర్చారు. మరో వారం రోజులు కస్టడీ ఇవ్వాలని ఈడీ మళ్లీ కోరింది. దీంతో కోర్టు మరో మూడు రోజులు కస్టడీకి ఇచ్చింది. మార్చి 26న కస్టడీ ముగియడంతో తిరిగి కోరుట్లో హాజరు పర్చారు ఈడీ అధికారులు.

మళ్లీ కస్టడీ కోరిన ఈడీ..
రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని ఈడీ ఆఫీస్‌లోనే విచారణ చేసింది. తాజాగా మరోమారు కస్టడీ కావాలని కోర్టు కోరింది. కానీ, ఈడీ ముందుగా కవితకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. మార్చి 9 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా కవిత అరెస్టు అయిన నాటి నుంచి దాదాపు పది రోజులు ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నారు కవిత. ఇక కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు కూడా కల్పించింది కోర్టు. దీంతో రోజూ ఇద్దరిని కలుస్తూ వచ్చారు. ఇప్పుడు జుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో తిహార్‌జైలుకు తరలించనున్నారు.

ఏప్రిల్‌ 1న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ..
ఇక కవిత తనకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్‌ ఇవ్వాలని కోరారు. కానీ, దీనిని కోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్‌ 1న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేస్తామని తెలిపింది.

తిహాజ్‌ జైలుకు తరలింపు..
ఇక కవితను తిహార్‌ జైలుకు తరలించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్టు అయ్యారు. అందరూ తిహార్‌ జైలుకు వెళ్లారు. ఇప్పుడు కవిత కూడా తిహార్‌ జైలుకు వెళ్లనున్నారు.