
Noel- Esther: పెళ్ళైన ఏడాదికే విడిపోయారు సింగర్ నోయల్-హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. 2019లో వివాహం చేసుకున్నారు. 2020లో విడాకులు తీసుకున్నారు. పెళ్ళైన రెండు మూడు నెలల్లోనే మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఎస్తేర్-నోయల్ ఎందుకు విడిపోయారు? గొడవలకు కారణం ఏమిటీ? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఎస్తేర్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.
మాది అరేంజ్జ్ మ్యారేజ్ లాంటిదే. పెళ్ళికి ముందు కొన్నాళ్లు సన్నిహితంగా ఉన్నాము. నన్ను పెళ్లి చేసుకోబోయే వాడిగా చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడు. మంచి మాటలు చెప్పేవాడు. పెళ్లయిన వెంటనే తన నిజస్వరూపం బయటకు తీశాడు. పెళ్లికి ముందు చెప్పిన మాటలకు అతని నిజ జీవితానికి అసలు సంబంధం లేదు. పెళ్ళైపోయింది, ఇక ఎక్కడకు వెళుతుందన్నట్లు ప్రవర్తించేవాడు. నన్ను మానసిక వేదనకు గురి చేశాడు.
ఇది నా ఊరు, అంతా నా వాళ్ళు. నిన్ను ఎవరు నమ్మరు అనేవాడు. ఎవరో ఎందుకు కనీసం నిన్ను నీ పేరెంట్స్ కూడా నమ్మరనే వాడు. నిజంగా తన చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్స్ అలా ట్యూన్ చేశాడు. తాను అందరికంటే మంచివాడు అన్నట్లు ప్రవర్తించేవాడు. పెళ్ళికి ముందు అతను చెప్పినవన్నీ అబద్ధాలే అని నాకు తెలిసింది. అతని వలన మెంటల్ టార్చర్ అనుభవించాను. అందుకే విడిపోయాము. చివరికి బిగ్ బాస్ హౌస్లో కూడా నోయల్ నన్ను తప్పుగా ప్రొజెక్ట్ చేసి సింపతీ పొందే ప్రయత్నం చేశాడు… అంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చారు.

కర్ణాటకకు చెందిన ఎస్తేర్ పాతిక చిత్రాలకు పైగా నటించారు. ఆమె సింగర్ కూడాను. రెక్కీ టైటిల్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్లో నటించారు. కొన్ని సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేశారు. ఇక నోయల్ సీన్ విషయానికొస్తే… నటుడిగా, సింగర్ గా అతడు రాణిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో నోయల్ పాల్గొన్నారు. అతడు అనారోగ్య సమస్యలతో వాక్ అవుట్ అయ్యారు. హౌస్ నుండి బయటకు వస్తూ తోటి కంటెస్టెంట్ ముక్కు అవినాష్ మీద ఆరోపణలు చేశారు.