
Viral News: తెలంగాణ జిల్లాలో ఎడారి ప్రాంతాలను తలపించే గిరిజన తండాలు ఉన్నాయి.ఎన్ని ప్రభుత్వాలు మారిన పాపం ఇక్కడ నివసించే గిరిజన వాసుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. అలాంటి ఒక గూడెం లో ఇటీవల జరిగిన ఒక హృదయాల్ని పిండేసే నిజాలను తెలుసుకోబోతున్నాము. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గిరిజన తాండాలో ఆరు కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఎడారి ని తలపించే ఈ ప్రాంత వాసీయులు తమ అవసరానికి కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలంటే ప్రతీ రోజు ఈ తాండా కి పది కిలోమీటర్స్ దూరం లో ఉన్న ఇంద్ర వెల్లి గ్రామానికి వెళ్ళి తెచుకోవాల్సిందే. నాలుగు కిలో మీటర్లు కాలినడక వెళ్ళి ఆ తర్వాత మిగిలిన దూరం అక్కడ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలను లిఫ్ట్ అడిగి వెళ్లాల్సిందే. అలాంటి ప్రాంతం లో కొడప పారుబాయి అనే 22 ఏళ్ళ అమ్మాయి , జనవరి 10 వ తేదీన ఆమె ప్రసవించింది.

అయితే పారు బాబు బిడ్డకి జన్మనిచ్చిన పది రోజులకే అనారోగ్యం తో తుది శ్వాసని విడిచింది. అప్పటి నుండి ఆ పసికందు ఆకలి ని తీర్చడానికి తండ్రి జంగుబాబు మరియు తాత బాపురావు పడ్డ కష్టాలు మామూలైవి కావు. ప్రతీ రోజు వారిలో ఎవరో ఒకరు రాజాగూడ దగ్గర నుండి మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న ఖాన్ పూర్ లో కాలినడకన,ఆ తర్వాత మరో 7 కిలోమీటర్లు వాహనాల సహాయం తో ఇంద్రవెల్లికి చేరుకొని పాల ప్యాకెట్స్ కొని తీసుకొస్తున్నారు.
ఆ చిన్న బిడ్డ ఆకలి తీర్చడం ఇంత కష్టపడడం ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నెటిజెన్స్. పోషించే స్తొమత లేక పిల్లల్ని అమ్మేస్తున్న తల్లితండ్రులు ఎంతోమంది ఉన్న ఈ రోజుల్లో, కష్టమో నష్టమో మా బిడ్డని మేమె పోషించుకుంటాము అంటూ ఈ స్థాయిలో కష్టపడుతున్న జంగు బాబు మరియి బాపు రావులకు నెటిజెన్స్ సెల్యూట్ చేస్తున్నారు.