
No Entry Movie Trailer: సర్వైవల్ థ్రిల్లర్స్ కి హాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. లైఫ్ ఆఫ్ పై, గ్రావిటీ, ది గ్రే, 127 హౌర్స్, ఆల్ ఈజ్ లాస్ట్ చిత్రాలు ఈ జోనర్లో తెరకెక్కి విజయం సాధించాయి. ఇండియన్ ప్రేక్షకులకు ఈ జోనర్ కొంచెం కొత్త. ఇటీవల జాన్వీ మిల్లీ టైటిల్ తో సర్వైవల్ థ్రిల్లర్ చేశారు. తెలుగులో శ్రీ సింహ ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే ఒక మూవీ చేశారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ రెండు చిత్రాలు మూవీ లవర్స్ కి కొత్త అనుభూతిని పంచాయి. ఇదే జోనర్లో నో ఎంట్రీ తెరకెక్కింది. ఇది యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.
నో ఎంట్రీ చిత్రం ఒక ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుంది. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు వెకేషన్ కోసం దట్టమైన ఫారెస్ట్ లోకి అడుగుపెడతారు. అక్కడ వాళ్లకు కుక్కల నుండి ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. భయంకరమైన కుక్క జాతికి ప్రయోగాల్లో భాగంగా ఎస్ 40 అనే ఒక మందును కనిపెట్టి ఎక్కిస్తారు. శత్రు దేశాల సైన్యం బోర్డర్ దాటకుండా చేయాలనేది ఆ ప్రాజెక్ట్ లక్ష్యం. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ విపరీతానికి దారి తీస్తుంది.
ఎస్ 40 మందు కారణంగా కుక్కలలో కొత్త వైరస్ రూపాంతరం చెందుతుంది. దాంతో అవి మనుషుల్ని వేటాడే మృగాలుగా తయారవుతాయి. వెకేషన్ కి వెళ్లిన యువకులు ఆ కుక్కల బారిన పడతారు. వారిపై ఆ కుక్కలు భీకరంగా దాడి చేస్తాయి. అడవిలోకి వినోదం కోసం వెళ్లిన ఆ గ్యాంగ్ ప్రమాదం నుండి బయటపడ్డారా? ఆ గ్యాంగ్ లో ఒకరైన ఆండ్రియా లక్ష్యం ఏమిటి? ఆ కుక్కలను ఎలా అదుపు చేయగలిగారు? అనేదే మొత్తంగా నో ఎంట్రీ మూవీ కథ.

ట్రైలర్ ఆద్యంతం దుమ్ములేపింది. కీకారణ్యంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన నో ఎంట్రీ సక్సెస్ అయ్యే సూచనలు కలవు. యాక్షన్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి నచ్చే చిత్రం ఇది. నటి ఆండ్రియా ప్రధాన పాత్ర చేశారు. నో ఎంట్రీ చిత్రానికి ఆర్. అలుగు కార్తీక్ దర్శకుడు. అజేష్ సంగీతం అందించారు. జంబో సినిమాస్ బ్యానర్లో శ్రీధర్ అరుణాచలం నిర్మించారు. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. ఆండ్రియాకు తెలుగులో కొంత గుర్తింపు ఉంది. ఆమె మేనియా థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించవచ్చు.