
Sir Collections: ఈమధ్య కాలం లో ఇండస్ట్రీ లోకి వచ్చిన ‘సితార ఎంటెర్టైమెంట్స్’ సంస్థ తక్కువ సమయం లోనే టాలీవుడ్ టాప్ 5 నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది.సూర్య దేవర నాగవంశీ ఆద్వర్యం లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కిస్తున్న ఈ సినిమా, అప్పుడప్పుడు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటుంది.గత ఏడాది ‘DJ టిల్లు’ మరియు ‘భీమ్లా నాయక్’ వంటి భారీ హిట్ సినిమాలు తీసి లాభాలను మూటగట్టుకున్న నాగవంశీ ఆ తర్వాత ‘వరుడు కావలెను’,’స్వాతి ముత్యం’ మరియు రీసెంట్ గా ‘బుట్ట బొమ్మ’ వంటి సినిమాలు తీసి భారీగా నష్టపోయాడు.
భీమ్లా నాయక్ మరియు డీజే టిల్లు సినిమాల ద్వారా వచ్చిన లాభాలు మొత్తం ఈ మూడు సినిమాలతో పోయాయి.ఇప్పుడు లేటెస్ట్ గా ధనుష్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ తీసిన ‘సార్’ చిత్రం విడుదల చేసారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ముందుకి దూసుకుపోతుంది.
కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి 9 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి అప్పుడే ఆరు కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయట.’బుట్ట బొమ్మ’ సినిమా వల్ల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి మూడు కోట్ల రూపాయిల నష్టం వచ్చిందట.ఈ నష్టం మొత్తం చాలా తక్కువ గ్యాప్ లోనే రికవర్ అయిపోవడం నాగవంశీ కి కాస్త ఉపశమనం కలిగించినట్టు అయ్యింది.కేవలం తెలుగు లో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఈ సినిమా దుమ్ములేపేస్తుంది.

కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక ఈరోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా ఈ సినిమాకి అన్ని సెంటర్స్ లో సాలిడ్ హోల్డ్ వచ్చింది.చూస్తూ ఉంటే లాంగ్ రన్ కచ్చితంగా ఉందని అనిపిస్తున్న ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం తెలుగు నుండే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.