Homeట్రెండింగ్ న్యూస్Nipah Virus: చాపకింద నీరులా నిపా.. ఇంతకీ ఈ మహమ్మారి లక్షణాలు ఏంటో తెలుసా?

Nipah Virus: చాపకింద నీరులా నిపా.. ఇంతకీ ఈ మహమ్మారి లక్షణాలు ఏంటో తెలుసా?

Nipah Virus: దేవుడి సొంత ప్రాంతంగా పేరు పొందిన కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ చాప కింద నీరు లాగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల ఇద్దరు దుర్మరణం చెందారు. కోజికోడ్ జిల్లాలోని ఏడు ప్రాంతాలను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు కంటోన్మెంట్ జోన్లు గా ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. బయటి ప్రాంతాల వారిని ఆ ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం కోవిడ్ కాలంనాటి ఆంక్షలు అమలవుతున్నాయి. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే సమాజం కోలుకుంటున్న నేపథ్యంలో కొత్తగా ఈ నిపా వైరస్ ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఏమిటి? ఎటువంటి పద్ధతులు పాటిస్తే దీన్ని నివారించగలం?

నిపా వైరస్ ను 1999లో కనుగొన్నారు. ఇది మలేషియా, సింగపూర్ ప్రాంతంలో పందులు, ప్రజల్లో వ్యాప్తి చెందడం ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 300 మందికి నిపా వైరస్ సోకింది. వందమంది కన్నుమూశారు. అయితే పందుల ద్వారా ఈ వ్యాధి వస్తుందని తెలుసుకున్న శాస్త్రవేత్తలు 10 లక్షల పందులను హత మార్చారు.. ఆ తర్వాత నుంచి మలేషియా, సింగపూర్ ప్రాంతాల్లో నిపా వైరస్ కేసులు నమోదు కాలేదు. కానీ ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ప్రధానంగా బంగ్లాదేశ్, భారత్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది.

నిపా వైరస్ అనేది హెనిపా వైరస్ జాతికి చెందిన పారా మిక్సో విరిడే కుటుంబానికి చెందినది. అంటే మొదట్లో ఇది జంతువులు నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. నిపా వైరస్ జన్యుపరంగా హెండ్రా వైరస్ కు సంబంధించినది. గబ్బిలాలను హెనిపా వైరస్ ను మోసుకెళ్ళే వాహకాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. నక్కలు కూడా వైరస్ ప్రాథమిక వాహకాలుగా గుర్తించారు. ఈ వైరస్ గబ్బిలాలు, నక్కల ద్వారా పందులకు సోకినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అయితే ఈ వైరస్ సోకిన జంతువులను మనుషులు తాకితే.. వారికి వెంటనే వ్యాపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో “స్పిల్ ఓవర్ ఈవెంట్” అంటారు. ఇలా ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో 40 నుంచి 70 శాతం మందికి మరణం సంభవించే అవకాశాలుంటాయి. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, అడుగు తీసి అడుగు వేయలేనంత నిస్సత్తువ, ఆకలి పూర్తిగా మందగించడం, శరీరం వేగంగా బరువు కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి . వ్యాధినిరోధక శక్తి లేనివారు త్వరగా మరణానికి గురవుతారు. కేరళ రాష్ట్రంలో చోటుచేసుకున్న మరణాలు కూడా ఈ కోవలోనివే. అయితే వైరస్ నివారణకు నిర్దిష్టమైన వైద్య విధానం అంటూ లేదు. కాకపోతే వైద్యులు కోవిడ్ నివారణకు ఎటువంటి చికిత్స అందించారో.. దీనికి కూడా ఆ స్థాయిలోనే చికిత్స అందించడం ద్వారా వైరస్ అదుపులోకి వస్తోందని భావిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version