Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : ఒక తండ్రిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది.. జగన్ భావోద్వేగ ట్వీట్ వైరల్!

YS Jagan : ఒక తండ్రిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది.. జగన్ భావోద్వేగ ట్వీట్ వైరల్!

YS Jagan : వైసిపి అధినేత జగన్( Jagan Mohan Reddy) చాలా ఆనందంగా ఉన్నారు. ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న చిన్న కుమార్తె వర్షారెడ్డిని అభినందిస్తూ జగన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన ఇద్దరు పిల్లలతో తమ దంపతులు తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రెండింగ్ గా నిలుస్తోంది. జగన్ లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు సైతం కీలక సూచనలు చేసింది. దీంతో ప్రత్యేక విమానంలో జగన్ దంపతులు లండన్ వెళ్లారు. అక్కడ తన చిన్న కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవం లో జగన్ దంపతులు పాల్గొన్నారు. అందుకే ఆమెను అభినందిస్తూ ప్రత్యేకమైన పోస్ట్ చేశారు జగన్.

* ఈనెల 16న పట్టా ప్రధానం
జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డి( Varsha Reddy ) లండన్ లోని ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజీలో చదువుకున్నారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా ప్రధానోత్సవం ఈనెల 16న జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు జగన్ దంపతులు. తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో ఆనందం గా గడుపుతున్నారు జగన్. సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.’ అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్ లో చదివి పట్టభద్రురాలు కావడంతో పాటు డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యయ్యావు. ఆ దేవుడు ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

* సిబిఐ కోర్టు అనుమతి
అంతకుముందు జగన్ విదేశీ పర్యటనకు( foreign tour) సంబంధించి ప్రతిష్టంభన నడిచింది. ప్రస్తుతం జగన్ బెయిల్ పై ఉన్నారు. ఆయన క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ పై ఉన్నారు. ఆయన విదేశాలకు వెళ్లాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి. లండన్ లో చదువుతున్న తన రెండో కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ పూర్తి చేసింది. ఆమె డిగ్రీ పట్టా ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును ఆశ్రయించారు. దీంతో పరిగణకులోకి తీసుకున్న నాంపల్లి కోర్ట్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో జగన్ దంపతులు మంగళవారం లండన్ వెళ్లారు. ఈ నెలాఖరు వరకు అక్కడే గడపనున్నారు.

* లండన్ లో ఘన స్వాగతం
ఈ ఎన్నికల్లో( 2024 elections ) ఓటమి తర్వాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. గత ఏడాది ఎన్నికల పోలింగ్ అనంతరం జగన్ విదేశాలకు వెళ్లారు. ఫలితాల ప్రకటనకు ముందుగా ఏపీకి చేరుకున్నారు. అయితే తొలిసారిగా విదేశీ పర్యటనకు వచ్చిన జగన్ కు తాజాగా ఎన్నారైలు, ప్రవాస ఆంధ్రులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వైయస్సార్ కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఇది పూర్తిగా ప్రైవేటు పర్యటన. ఇందులో రాజకీయ అంశాలకు ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలామంది జగన్ ను ప్రత్యేకంగా కలవడానికి వస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular