Naveen Murder Case: ప్రేమకు అడ్డంకిగా మారిన స్నేహితుడు నవీన్‌ను హరిహరకృష్ణ హత్య చేసి.. గుండెను కోసి దేహశుద్ధి చేశాడు. మరో స్నేహితుడు కూడా నిందితుడికి పూర్తిగా సహకరించాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుడి స్నేహితుడు హసన్, ప్రియురాలు కట్టా నిహారికరెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: Women’s Day 2023: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.. ఈ సంవత్సరం ప్రాధాన్యతేంటి?
ట్విస్టుల మీద ట్విస్టులు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్, ప్రియురాలు నిహారిక ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ కేసులో నిందితుడు హరిహరికృష్ణకు సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచి పెట్టినందుకు పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రియురాలు నిహారిక కోసమే నవీన్‌ను హత్య చేసినట్లు పోలీసుల కస్టడీలో నిందితుడు హరిహరకృష్ణ చెప్పాడు. దీంతో పోలీసులు యువతి నిహారికను ఈ కేసులో నిందితురాలిగా చేర్చి కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిహారికతోపాటు హరిహరకృష్ణ స్నేహితుడు హసన్‌ను కూడా రెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హాసన్, ఏ3గా నిహారిక పేర్లు చేర్చారు.
ప్రియురాలు పరోక్ష సహకారం..
నవీన్ హత్య తర్వాత నిహారిక హరిహరకృష్ణకు రూ.1500 ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. హరిహరకృష్ణతో పలుమార్లు వాట్సాప్ చాటింగ్ చేసినట్టు గుర్తించారు. నవీన్ హత్యకు నిహారిక పరోక్షంగా హరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో యువతి అరెస్ట్ కీలక పరిణామంగా చెప్పొచ్చు. నవీన్ హత్య కేసులో ప్రియురాలు నిహారిక ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు.
హత్య గురించి తెలిసినా దాచారు..
నవీన్‌ను చంపిన తర్వాత హరిహరకృష్ణ నిహారికకే ఫొటోలు పంపించాడు. చాటింగ్ చేశాడు. నిహారిక కూడా రిప్లై ఇచ్చింది. హత్య గురించి తెలిసినా.. నిహారిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. దీన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ కేసులో హరి స్నేహితుడు హాసన్ కూడా పూర్తిగా సహకరించాడు. ఈ మేరకు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ సేకరించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత హరి.. తన మిత్రుడు హాసన్ రూమ్ కి వెళ్లాడు. రక్తపు మరకలు ఉన్న దుస్తులను వాష్ చేసుకున్నాడు. నవీన్‌ను హత్య చేసినట్లు హసన్‌కు చెప్పాడు. అయినప్పటికీ..నవీన్ హత్య విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టాడు. దీంతో పోలీసులు అతడిని కూడా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.
తమకు ఏమీ తెలియనట్లు నిహారిక ఇన్నాళ్లూ నటించింది. తన జోలికి వస్తే ఆత్మహత్య కూడా చేసుకుంటానని బెదిరించింది. కానీ పోలీసుల విచారణలో నిహారిక కోసమే నవీన్‌ను చంపానని హరిహర కృష్ణ చెప్పడం, ఆమెకు విషయం తెలుసన్న కోణంలో విచారణ జరిపి సాక్షాధారాలు సేకరించారు పోలీసులు.
Also Read:Chandrababu- BJP: వాళ్లను దువ్వుతూ బీజేపీకి షాకిస్తున్న చంద్రబాబు