Women’s Day 2023: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.. ఈ సంవత్సరం ప్రాధాన్యతేంటి?

Women’s Day 2023: ఆకాశంలో సగం.. అవనిలో సగం అంటారు. ఆడాళ్లకు మగాళ్లతో నేడు సమాన అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఎందులో కూడా వారు వెనక్కి పోవడం లేదు. పైలట్లుగా కూడా రాణిస్తున్నారు. ఆడవారు మగవారితో సమానంగా పనులు చేస్తున్నారు. గతంలో వంటింటి కుందేలుగా ఉండేవారు ప్రస్తుతం తమ సత్తా చాటుతున్నారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి ఆచరణలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం గురించి చాలా విషయాలు […]

Written By: Srinivas, Updated On : March 8, 2023 10:20 am
Follow us on

Women’s Day 2023

Women’s Day 2023: ఆకాశంలో సగం.. అవనిలో సగం అంటారు. ఆడాళ్లకు మగాళ్లతో నేడు సమాన అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఎందులో కూడా వారు వెనక్కి పోవడం లేదు. పైలట్లుగా కూడా రాణిస్తున్నారు. ఆడవారు మగవారితో సమానంగా పనులు చేస్తున్నారు. గతంలో వంటింటి కుందేలుగా ఉండేవారు ప్రస్తుతం తమ సత్తా చాటుతున్నారు. మహిళా సాధికారతకు పట్టం కట్టేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి ఆచరణలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం గురించి చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది.

Also Read: Chandrababu- BJP: వాళ్లను దువ్వుతూ బీజేపీకి షాకిస్తున్న చంద్రబాబు

సమాజంలో ఆడవారి పాత్ర బహుముఖంగా ఉంటుంది. తల్లి, చెల్లి, భార్య, స్నేహితురాలు పాత్ర ఏదైనా తనవంతు బాధ్యత నిర్వహించడం కామనే. ప్రస్తుతం ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మహిళల కోసం ఓ రోజు ఉండాలనే ఉద్దేశంతో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల గొప్పతనాన్ని తెలియజేసే మహిళా దినోత్సవం గురించి చాలా విషయాలు ఉన్నాయి.

మహిళల కోసం ప్రత్యేకమైన రోజుగా మార్చి 8ని భావిస్తున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సాధికారతపై దృష్టి సారించేలా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళా దినోత్సవాన్ని వేదికగా అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా లింగ వివక్షతను రూపుమాపాలని తీర్మానించారు. మహిళా సాధికారతను సాధించే దిశగా ఇంకా ముమ్మర కసరత్తులు చేయాల్సిన అవసరం ఉందని తేల్చారు.

Women’s Day 2023

మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లింగ వివక్షతను రూపుమాపే ప్రక్రియలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని మహిళల ప్రయోజనాలు కాపాడాల్సిన చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మహిళా శక్తికి ఏది సాటి రాదని గుర్తించాలని అంటున్నారు. మహిళా చైతన్యానికి ఇంకా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళల శక్తి సమాజానికి కావాలి.

భవిష్యత్ లో మహిళా సాధికారత ఒక ఉద్యమంలా ముందుకు పోవాలి. ఇప్పటికే చాలా రంగాల్లో మహిళలు స్థిరపడినా ఇంకా మహిళలకు అవకాశాలు పెరగాలి. ప్రతి అంశంలో వారికి సమానమైన అవకాశాలు ఇవ్వాలి. మహిళలు చేయలేని పనులు ఏమీ లేవు. ప్రస్తుతం ప్రతి రంగంలో కూడా వారి పాత్ర ఉంటోంది. అందుకు అనుగుణంగా ఇంకా చొరవ తీసుకోవాలి. వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని సమాజంలో ఒక భాగంగా చేయడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నారు. మహిళా దినోత్సవం ప్రత్యేకత కూడా అదే. అన్నింట్లో వారికి ప్రాతినిధ్యం కల్పించడమే ముఖ్య ఉద్దేశం.

Also Read:Dil Raju: ఈ విషయంలో దిల్ రాజును నిజంగా మెచ్చుకోవాల్సిందే!

 

Tags