New Rules From 1st July: దేశంలో నిత్యం కోట్లాదిమంది ప్రయాణికులు రైల్వే జర్నీ చేస్తుంటారు. మిగతా ప్రయాణాల కంటే ట్రైన్ జర్నీ తక్కువ ధరతో ఉండడంతోపాటు సౌకర్యంగా కూడా ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి రైల్వేచార్జీలు పెరుగుతూ ఉంటాయి. తాజాగా జూలై 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రైల్వే ఛార్జీలు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జూలై 1 అర్ధరాత్రి నుంచి రైల్వే చార్జీలు అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తరగతిలో వారీగా.. కేటగిరి లను బట్టి చార్జీలు పెంచినట్లు పేర్కొన్నారు. మరోవైపు జూలై 1 నుంచి రైల్వే నిబంధనలో కొన్ని మార్పులు ఉండలు ఉన్నాయి. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. అయితే రైల్వే చార్జీలు ఏ విధంగా పెరిగాయో ఇప్పుడు చూద్దాం..
Also Read: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కు ముందున్నవన్నీ గడ్డు రోజులేనా?
రైల్వే ఛార్జీలు మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్ కు ఒక పైసా వంతున పెంచారు. ఏసీ కోచ్ లలో కిలోమీటర్లకు రెండు పైసల వంతున పెరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే సబర్బన్ రైళ్ల చార్జీలు, నెలవారి సీజన్ టికెట్ల రైలు చార్జీలు పెంచలేదని అధికారులు తెలిపారు. మరోవైపు స్లీపర్ చార్జీలు 500 కిలోమీటర్ల వరకు కూడా పెరగలేదని పేర్కొన్నారు. 500 కిలోమీటర్ల తర్వాత అర్ధ పైసా వంతెన పెరిగినట్లు తెలిపారు. రైల్వే చార్జీలు జూలై 1 అర్థరాత్రి 12 గంటల నుంచి వర్తిస్తునట్లు తెలిపారు. అంతకుముందే టికెట్ బుక్ చేసుకుంటే ఈ చార్జీలు వర్తించమని పేర్కొన్నారు. రైల్వే చార్జీల పెంపుదల వందే భారత్, శతాబ్ది, అంత్యోదయ, జన శతాబ్ది, సాధారణ నాన్ సబర్బన్ సర్వీస్ లకు కూడా వర్తిస్తుంది అని అధికారులు తెలిపారు.
సెకండ్ క్లాస్ రైల్వేలో 500 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు రూ, 5 పెంచారు. 1501 నుంచి 2500 వరకు టికెట్ పై రూ.10 పెరగనుంది.2501 నుంచి 3,000 కిలోమీటర్ల వరకు రూ.15 పెరగనుంది. అన్ని రకాల ఏసీ తరగతులకు కిలోమీటర్ కు రూ. 2 పైసలు పెంచనున్నారు.
రైల్వే చార్జిల పెంపుతో పాటు నిబంధనలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పటివరకు తాత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటే కేవలం లాగిన్ అయ్యే వారి ఆధార్ కార్డు వివరాలు మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఎంతమంది రైలు ప్రయాణాలు చేస్తున్నారో వారందరి ఆధార్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ కార్డుతో లింకు అయిన మొబైల్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే తాత్కాల్ టికెట్ బుక్ అవుతుంది. అందువల్ల ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో నిబంధనలను గమనించాలని అన్నారు. అంతేకాకుండా వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫామ్ కాకపోతే జనరల్ లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. స్లీపర్ లో ప్రయాణించే అవకాశం ఉండదు. అలా ప్రయాణం చేస్తే జరిమానా కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా స్లీపర్ నుంచి ఇతర క్లాసులోకి పంపే అవకాశం ఉంది.