Adipurush New Poster: మళ్ళీ పప్పులో కలిసిన ఆదిపురుష్ డైరెక్టర్… పోస్టర్ పై ట్రోలింగ్ షురూ!

Adipurush New Poster: అరాకోరా అనుభవంతో కొన్ని సబ్జక్ట్స్ టచ్ చేయడం సబబు కాదు. అందులోనూ సెంటిమెంట్స్ తో ముడిపడిన సబ్జక్ట్స్ జోలికి అసలు పోకూడదు. ఆ తప్పు చేసిన దర్శకుడు ఓమ్ రౌత్ విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఆదిపురుష్ టీజర్ విడుదల నాటి నుండి ఆయనకు సెగ మామూలుగా తగలడం లేదు. ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో దర్శకుడిని ఏకిపారేశారు. రావణాసురుడు పాత్ర చేసిన సైఫ్ అలీఖాన్ ని హాలీవుడ్ యాక్షన్ చిత్రాల విలన్ మాదిరి […]

Written By: Shiva, Updated On : March 30, 2023 3:44 pm
Follow us on

Adipurush New Poster

Adipurush New Poster: అరాకోరా అనుభవంతో కొన్ని సబ్జక్ట్స్ టచ్ చేయడం సబబు కాదు. అందులోనూ సెంటిమెంట్స్ తో ముడిపడిన సబ్జక్ట్స్ జోలికి అసలు పోకూడదు. ఆ తప్పు చేసిన దర్శకుడు ఓమ్ రౌత్ విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఆదిపురుష్ టీజర్ విడుదల నాటి నుండి ఆయనకు సెగ మామూలుగా తగలడం లేదు. ఆదిపురుష్ ట్రైలర్ విషయంలో దర్శకుడిని ఏకిపారేశారు. రావణాసురుడు పాత్ర చేసిన సైఫ్ అలీఖాన్ ని హాలీవుడ్ యాక్షన్ చిత్రాల విలన్ మాదిరి చూపించారు. అలాగే హనుమంతుడు కాస్ట్యూమ్ కూడా విమర్శల పాలైంది. ఓం రౌత్ కి అసలు పురాణాలు తెలుసా? రావణుడు పరమశివుడు భక్తుడు. తమకు ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా? అని మండిపడ్డారు.

హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి. దీంతో ఆదిపురుష్ ఆరు నెలలు వాయిదా వేసి కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారు. విమర్శల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఓ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ కూడా విమర్శలు ఎదుర్కొంటుంది.

రాముడు తలకు కిరీటం లేదు, సీత పాత్ర చేసిన కృతి సనన్ అయితే ఓ వస్త్రం తలపై ముసుగులా వేసుకున్నారు. లక్ష్మణుడు గెటప్, ఆ ముఖంలో ఎక్స్ప్రెషన్ సరిగా లేవని, ఒక ఐకానిక్ సన్నివేశంలో రాముడు, సీత, లక్ష్మణుడు గెటప్స్ ఇంతేనా ఉండేది అంటూ… ట్రోల్ చేస్తున్నారు. రాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు వచ్చే తరుణంలో రామలక్ష్మణులు, సీత నిండైన వస్త్రధారణ, నగలు, కిరీటం ధరించి కనిపిస్తారు. ఆ ఫొటోతో ఆదిపురుష్ పోస్టర్ ని పోల్చుతూ ట్రోల్ చేస్తున్నారు.

Adipurush New Poster

ఓమ్ రౌత్ కి పురాణాల మీద అవగాహన ఉంది. అయితే ఈ జనరేషన్ కి తగ్గట్లు ఆయన ఏవో ప్రయోగాలు చేయబోయారు. పౌరాణిక పాత్రలను భిన్నంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. దానిపై ఇంతటి వ్యతిరేకత వస్తుందని బహుశా ఊహించి ఉండడు. రాముడుకి అనేక పేర్లు ఉన్నాయి. ఈ చిత్రంలో రాఘవ అనే పేరు వాడుతున్నారు. సీతను జానకి అంటున్నారు. ఇన్ని వివాదాల మధ్య జూన్ 16న వరల్డ్ వైడ్ ఈ మూవీ విడుదల కానుంది.