
Samantha: సమంత కెరీర్లో దారుణ పరాజయంగా శాకుంతలం మిగిలిపోనుంది. పెట్టుబడిలో పది శాతం తిరిగి వచ్చే సూచనలు లేవు. ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న శాకుంతలం వసూళ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. సమంత గత చిత్రం యశోద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 60-70 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టి సమంత స్టామినా ఏమిటో నిరూపించింది. అలాంటిది శాకుంతలం చిత్రానికి పూర్ ఓపెనింగ్స్ దక్కాయి. చెప్పాలంటే శాకుంతలం చిత్రం మీద ఎలాంటి హైప్ లేదు. టీజర్ ట్రైలర్ చూశాక శాకుంతలం జోలికి పోకుంటే బెటర్ అని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు.
దానికి తోడు డిజాస్టర్ టాక్ రావడంతో శాకుంతలం థియేటర్స్ వైపు జనాలు వెళ్ళడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. నాసిరకం గ్రాఫిక్స్, సీరియల్ ని తలదన్నే స్క్రీన్ ప్లే తో దర్శకుడు గుణశేఖర్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. ఏ ప్రాజెక్ట్ లో దిల్ రాజు లాంటి అభిరుచి ఉన్న నిర్మాత ఎలా ఏలు పెట్టాడని ఇప్పటికీ చాలా మంది సందేహం.
కాగా శాకుంతలం మూవీ బాగోలేదన్న ఓ నెటిజెన్ ని సమంత బ్లాక్ చేయడం న్యూస్ అయ్యింది. సదరు నెటిజెన్ ఈ విషయాన్ని ట్వీట్ చేయగా వైరల్ అవుతుంది. ‘శాకుంతలం మూవీ డిజాస్టర్. ఇంత చెత్త సినిమా నేను జీవితంలో చూడలేదు. సమంత డబ్బింగ్ దారుణం. ఇకపై డబ్బింగ్ చెప్పకు. నీ ఓవర్ యాక్షన్ ఆపు… అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అతని విమర్శలకు మండిపడ్డ సమంత బ్లాక్ చేసింది. దాంతో ఆ నెటిజెన్ ఫైర్ అయ్యాడు.

సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను బ్లాక్ చేస్తావా? సమంత నువ్వు చాలా ఛీప్ అంటూ మరొక ట్వీట్ చేశాడు. సదరు నెటిజెన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిజం చెబితే తట్టుకోలేవా అని అతను సమంతపై కామెంట్ చేశాడు. నిజానికి ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. ఒక పౌరాణిక చిత్రానికి వచ్చీ రాని తెలుగుతో డబ్బింగ్ చెబితే జీర్ణించుకోవడం కష్టమే. ట్రైలర్ లోనే ఇది అర్థమైంది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా సినిమాలు తీసి జనాల ముఖాన కొడుతున్నట్లు అనిపిస్తుంది.
She blocked me for just telling that I didn’t like the movie. @Samanthaprabhu2 You are Very Cheap. #Shaakuntalam #SSMB28 #SSMB29 #Pushpa2 #OV #Agent #Custody #KGFChapter2 pic.twitter.com/iY9EUFJtk0
— takkaridonga (@tfi_fan99) April 14, 2023