Hyderabad Floods Trolling: ఒకవైపు మెట్రో… ఎంఎంటీఎస్.. మరోవైపు వందలాది రవాణా వాహనాలు.. ఫ్లైఓవర్లు.. లింక్ రోడ్లు.. ఔటర్ రింగ్‌రోడ్డు.. బీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు హైదరాబాద్ విశ్వనగరం అయిందని చెప్పే మాటలు.. ఉదాహరణలు.. కానీ రెండేళ్లుగా హైదరాబాద్‌ను ముంచెత్తుతన్న వరదలు లోపాలను ఎత్తి చూపుతున్నాయి. పాలకుల వైఫల్యాలను ఏకరువు పెడుతున్నాయి. ఇక ప్రజల సమస్యలు అయితే ఎవరికీ పట్టడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక వ్యంగ్య పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మరో రవాణా సాధనం..
విశ్వనగరం హైదరాబాద్‌కు మెట్రో, ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు, ఓలా బైక్‌లతోపాటు మరో వాహనం కూడా రాబోతోందని ఈ వీడియో రూపొందించారు. ఆ వాహనమే.. పడవ.. నిజమే హైదరాబాద్‌లో నదేలేదు కదా.. పడవ ఎందుకు వస్తుందనుకుంటున్నారా.. కానీ పరిస్థితి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. వీడియో సెటైరికల్‌గా చేసినా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. రెండేళ్లుగా వర్షాలు విశ్వనగరాన్ని ముంచెత్తుతుండడంతో ట్రాఫిక్‌లో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. పది నిమిషాల్లో చేరుకునే దూరాన్ని కూడా నాలుగైదు గంటల సమయం పడుతుంది. దీంతో విశ్వనగరం రోడ్లపైకి వర్షాకాలంలో బోటైతేనే బెటర్ అన్నట్లగా ‘మేడం.. గచ్చిబౌలి… మాదాపూర్.. కొండూర్.. హైటెక్‌సిటీ.. రండి మేం రండి.. వేరే వాహనాలు రావు.. వర్షాకాలంలో బోట్లలోనే ప్రయాణించాలి’ అని సెటైర్ ఈ వీడియోలో ఉంది.
సోషల్ మీడియాలో వైరల్..
ఇప్పుడు ఈ వీడియ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోట్ కావాలంటే సంప్రదించండి.. ఫోన్ నంబర్ ప్లీజ్.. నిజమో బ్రో.. హైదరాబాద్ రోడ్లపై నీళ్లు.. ఆంధ్రాల్లో రోడ్లపై గుంతలు కామనే.. కొండాపూర్‌కు చార్జీ ఎంత.. బ్రో కారు, బైక్ తరాహాలో.. ఓ బోటు కూడా సొంతది కొనుక్కుంటే పోలా.. నిజమే ఇంటికో బోట్ ఉండాలి.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.