Mumbai Python: పాము కనిపిస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అదే నాగుపాము, కింగ్ కోబ్రా అయితే బతుకు జీవిడా అంటూ పరిగెత్తుతాం. ఇక కొండ చిలువ అయితే దానికి చిక్కకుండా చూస్తాం.. చెత్త చెదారం, పొదలు, పొలాల వద్ద, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పాములు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఓ భారీ కొండ చిలువ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ భవనంపై ప్రత్యక్షమైంది. 13వ అంతస్తుపై ఉన్న ఇండియన్ రాక్ కొండ చిలువను స్థానికులు అటవీ అధికారుల సాయంతో రక్షించారు.
పశ్చిమ ముంబైలో..
ముంబై ఘాట్‌కోపర్ (పశ్చిమ)లోని వ్రాజ్ ప్యారడైజ్ భవనంపై ఇండియన్ రాక్ కొండ చిలువను ఓ ఐటీ ఉద్యోగి సూరరాజ్‌సాహా గుర్తించాడు. అది పూర్తిగా తడిచి కనిపించింది. ఈ భవనం టెర్రస్‌పై నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వెంటనే అతడు పామును కాపాడేందుఉ అటవీశాఖ అధికారులకు సమాచారం అదించారు.
అరుదైన జాతిగా..
భవనంపై ఉన్న నాలుగు అడుగుల కొండ చిలువను రక్షించేందుకు ముంబై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాకేశ్‌భోయిర్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అరుదైన ఇండయిన్ రాక్ జాతి సరీసృపంగా గుర్తించారు. దానిని పట్టుMý] ని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
ఎలా వచ్చిందంటే..
అయితే ఈ కొండ చిలువ ఉన్న విషయం తెలిసి చాలా మంది దానిని చూసేందుకు వచ్చారు. అయితే దానికి ఎవరూ హాని చేయలేదు. భారీ వర్షాలు, వరదలకు ఈ పాము నగరంలోకి కొట్టుకువచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తనను తాను కాపాడుకునేందుకు లేదా ఆహారం వెతుక్కుంటూ ఇండియన్ రాక్ పాము భవనంపై ఎక్కి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ పాములు భవనాలు, చెట్లు సులభంగా ఎక్కుతాయని అటవీ అధికారులు తెలిపారు. అందుకే 13వ అంతస్తుపైకి సులభంగా ఎక్కి ఉంటుందని పేర్కొంటున్నారు.