
Manchu Vishnu: మంచు విష్ణు సినిమాలే కాదు ఆయన ట్వీట్స్ కూడా వెరైటీగా ఉంటున్నాయి. భార్య అంటే భయమంటూ ఆయన చేసిన కామెంట్ నెటిజెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ట్రోల్స్ కి తెగబడేలా ప్రోత్సహిస్తుంది. మంచు విష్ణు సాధారణ కామెంట్స్ నే ట్రోల్ చేసే నెటిజెన్స్… ఇలా భార్యకు భయపడతానని ఓపెన్ గా చెప్పడంతో దారుణంగా ఆడేసుకుంటున్నారు. ఏం చేస్తే భార్యకు అంతగా భయపడుతున్నావంటూ… ప్రశ్నిస్తున్నారు. విషయంలోకి వెళితే… మంచు విష్ణు తన పెళ్లి రోజు సందర్భంగా ఒక రొమాంటిక్ ట్వీట్ చేశారు. భార్యతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ… ‘నాన్న కంటే కూడా నా భార్య అంటేనే ఎక్కువ భయం, హ్యాపీ యానివర్సరీ’ అని కామెంట్ పెట్టాడు.
మంచు విష్ణు తన భార్యకు తానిచ్చే గౌరవాన్ని, ఆడవాళ్ళ ఔన్నత్యాన్ని పరోక్షంగా తెలియజేయాలని ఆ కామెంట్ చేశాడు. ఆయన ఉద్దేశం మంచిదే అయినా నెటిజెన్స్ కి మాత్రం ఎగతాళి వ్యవహారంగా తోచింది. అసలు తండ్రి కంటే కూడా భార్యకు ఎక్కువ భయపడటమేంది? పెళ్ళాం అంటే భయమని పబ్లిక్ గా చెప్పడమేంటి? అని ట్రోల్స్ చేస్తున్నారు. మంచు విష్ణు ట్వీట్ వైరల్ గా మారింది. మరోసారి ఆయన మీమర్స్, ట్రోలర్స్ కి కావాల్సిన మెటీరియల్ ఇచ్చాడు.
మంచు విష్ణు 2009 మార్చి 1న విరానికా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విరానికా స్వయానా చెల్లెలు. జగన్ బాబాయ్ కూతురే విరానికా రెడ్డి. ఏళ్ల తరబడి అమెరికాలో ఉన్న విరానికా డాక్టర్ కావాలనుకున్నారట. అయితే ఆమె బిజినెస్ ఉమన్ గా కొనసాగుతున్నారు. వీరు ఏకంగా నలుగురు పిల్లల్ని కన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్. ఇక విధంగా చెప్పాలంటే ఆయన కుటుంబ నియంత్రణ పాటించలేదు.

ఇక మంచు విష్ణు కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. 20 ఏళ్ల కెరీర్లో చెప్పుకోవడానికి నాలుగు హిట్స్ లేవు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఢీ విష్ణు కెరీర్లో అతిపెద్ద హిట్ అని చెప్పొచ్చు. 2003లో విష్ణు చిత్రంతో మోహన్ బాబు భారీగా లాంచ్ చేశారు. 25 చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన లేటెస్ట్ మూవీ జిన్నా సైతం నిరాశపరిచింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. జిన్నా వసూళ్లు కోటి రూపాయలు దాటలేకపోయాయి.