Singer Madhu Priya : మధుప్రియ (Singer Madhu Priya) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో అద్భుతమైన పాటలు, ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటుంది. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమాలో గోదారి గట్టు మీద సాంగ్ పాడి.. వావ్ అనిపించింది. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ (Trending) అవుతూనే ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత రమణ గోగులతో మధుప్రియ (Singer Madhu Priya) ఈ పాట పాడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మధుప్రియ ఓ వివాదంలో చిక్కుకుంది. ఈమెపై బీజేపీ నాయకులు, హిందువులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే ఈమెను అరెస్ట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు? ఈమె చేసిన తప్పు ఏంటో చూద్దాం.
సింగర్ మధుప్రియ ప్రైవేట్ అల్బమ్ సాంగ్స్ చేస్తుంటారు. తాజాగా ఈమె ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్కీశ్వర స్వామి ఆలయంలో షూటింగ్ చేశారు. అందులోనూ భక్తులకు దర్శనానికి లోపలికి వదల కుండా ఆమె షూటింగ్ చేసింది. గుడి తలుపులు మూసేసి మరి షూటింగ్ చేయడంతో ఈమె వివాదంలో చిక్కుకుంది. సాధారణంగా ఈ గుడిలో మొబైల్, ఫొటోలు తీసుకోవడానికి అనుమతి లేదు. కానీ ఈమె గర్భగుడి తలుపులు మూసేసి మరి షూటింగ్ చేయడంతో నెటిజన్లు మండి పడుతున్నారు. అసలు గర్భగుడిలో షూటింగ్ అసలు ఎవరి అనుమతితో చేశారని బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే మధుప్రియను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించి ఇలా చేయడం నిబంధనలను అతిక్రమించిందని అంటున్నారు. ఫొటోలు, వీడియోలు తీయడానికి నిషేధం అయినా కూడా బృందంతో కలిసి పాటను చిత్రీకరించడంతో పలువురు విమర్శిస్తున్నారు. ఆమెను రాష్ట్ర దేవాదాయ శాఖతో అనుమతి తీసుకున్న తర్వాతే చేశారని, మరికొందరు తీసుకోలేదని అంటున్నారు. నిబంధలనకు విరుద్ధంగా మధుప్రియ ఇలా చేయడంతో భక్తులు మనోభావాలు దెబ్బ తీసిందని పలువురు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరికి అనుమతి లేనిది ఆమెకు ఎలా ఆలయ అధికారులు షూటింగ్‌కి అనుమతి ఇచ్చారని అంటున్నారు. ఈమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఒక్కో స్పెషల్ డేకి ఈమె ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటుంది. వచ్చే నెల శివరాత్రి రాబోతుంది. ఈ క్రమంలో శివాలయంలో సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా కొందరు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే మధుప్రియ ఈ ఆలయంలో షూటింగ్ చేసింది. దీంతో మధుప్రియ వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ వివాదంపై ఇంకా మధుప్రియ స్పందించలేదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మధుప్రియ రూల్స్ అతిక్రమించిందని అనుకుంటున్నారా.. లేదా.. కామెంట్ చేయండి.
Free Hindu temples from govt. https://t.co/UuREts5hcD
— Rambo (@untaduntadi2) January 23, 2025