Baahubali 3: 150 కోట్లు ఖర్చు చేసి తీసి మరీ బాహుబలి-3ని ఎందుకు పక్కనపెట్టారు?

Baahubali 3: బాహుబలి.. వెండితెరపై ఎవర్ గ్రీన్ యాక్షన్ డ్రామా.. దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన ఈ శిల్పం లాంటి సినిమాలు టాలీవుడ్ నే కాదు.. ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచాయి. ఈ చిత్రాలను ఓ కళాఖండంగానే చెప్పొచ్చు. అయితే అవి రాజమౌళి తీయడం వల్లే అంత గొప్పగా వచ్చాయి. వేరే ఎవరూ అంతలా తీయలేరేమో.. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యక్రిష్ణ, నాజర్, సత్యరాజ్ లు పాత్రలకు ప్రాణం పోశారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. […]

Written By: NARESH, Updated On : January 25, 2022 9:02 am
Follow us on

Baahubali 3: బాహుబలి.. వెండితెరపై ఎవర్ గ్రీన్ యాక్షన్ డ్రామా.. దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన ఈ శిల్పం లాంటి సినిమాలు టాలీవుడ్ నే కాదు.. ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచాయి. ఈ చిత్రాలను ఓ కళాఖండంగానే చెప్పొచ్చు. అయితే అవి రాజమౌళి తీయడం వల్లే అంత గొప్పగా వచ్చాయి. వేరే ఎవరూ అంతలా తీయలేరేమో..

ప్రభాస్, రానా, అనుష్క, రమ్యక్రిష్ణ, నాజర్, సత్యరాజ్ లు పాత్రలకు ప్రాణం పోశారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ మూవీని దక్కించుకొని రిలీజ్ చేసిన ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘బాహుబలి.. బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో ఓ సిరీస్ ను నిర్మిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది. భారీ బడ్జెట్ కూడా కేటాయించింది.

‘ది రైజ్ ఆఫ్ శివగామి’, చతురంగ, క్వీన్ ఆఫ్ మాహిష్మతి రచనల ఆధారంగా ఆనంద్ నీలకంఠన్, దేవా కట్టా ఈ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. ప్రవీణ్ సత్తారుతో కలిసి దేవాకట్టా దీనికి దర్శకత్వం కూడా వహించారు. వాహికా, రాహుల్ బోస్, అతుల్ కులకర్ణి తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు.

ఇక శివగామి చుట్టూ నడిచే బాహుబలి3ని తెలుగు దర్శకులు దేవాకట్టా ప్రవీణ్ సత్తారు తీశారు. మొదట మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత అవుట్ పుట్ సరిగా రాక కొన్నాళ్లు ఆగింది. ఈక్రమంలోనే మృణాల్ తప్పుకోవడంతో కొత్తగా ఆమె స్థానంలో వామిక గబ్బిని తీసుకొని కొత్త దర్శకులను తీసుకున్నారు. కొత్తగా కునాల్ దేశ్ ముఖ్, రిభు దాస్ గుప్తాలకు డైరెక్షన్ అప్పగించారు. తెలుగు దర్శకులను పక్కనపెట్టారు. అయినా అవుట్ పుట్ సరిగా రాలేదు. దీంతో పూర్తిగా బాహుబలిని3 ని పక్కనపెట్టారు.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటివరకూ దాదాపురూ.150 కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు షూటింగ్, నిర్మాణాంతర కార్యక్రమాలు చేసిందట.. అయితే ఫైనల్ అవుట్ పుట్ చూశారని షాక్ అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను మొత్తాన్ని పక్కనపెట్టేసినట్టు టాక్. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రాజమౌళి లాంటి దర్శక ధీరుడు తీసిన బాహుబలికి దాని కొనసాగింపుగా నెట్ ఫ్లిక్స్ తీసిన బాహుబలి3కి చాలా తేడా ఉందట.. దేవాకట్ట, ప్రవీణ్ సత్తార్ లు ఆ రేంజ్ లో తీయలేకపోయారని నెట్ ఫ్లిక్స్ పూర్తిగా పక్కనపెట్టేసినట్టు టాక్. అయితే దీనిపై నెట్ ఫ్లిక్స్, సదురు సినిమా వ్యక్తులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.