Four Wheeler Bike: అవసరం.. మన ఆలోచనలకు పదును పెడుతుంది.. మనలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. అయితే సైంటిస్టులు అవసరం కోసం ల్యాబ్‌లో, ఇంజినీర్లు వర్క్‌షాప్‌లలో ప్రయాగాలు చేస్తారు. కానీ ఓ సామాన్యుడు తన అవసరం కోసం చేసిన ఆలోచన నుంచే బైక్ రిక్షా ఆవిష్కృతమైంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన కుటుంబ అవసరాల కోసం వాహనం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడంతో పెద్ద వాహనం కొనుగోలు చేయలేని పరిస్థితి. దీంతో కుటుంబంలో ఉన్న తొమ్మిది మంది కలిసి ఎక్కడైనా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఉన్న బైక్‌నే పెద్ద వాహనంగా మార్చాలన్న ఆలోచన ఆ యువకుడి మదిలో మెదిలింది. ఇందు కోసం గ్రామస్తుల సహకారం తీసుకున్నాడు.
రిక్షా బెనుకభాగం తగిలించి..
తనకు వచ్చిన ఆలోచనతో బైక్‌ను రిక్షాగా మార్చాలనుకున్నాడు. ఇలా చేయడం ద్వారా రిక్షాకన్నా వేగంగా పరిగెత్తడం, తొక్కే అవసరం ఉండదనుకున్నాడు. తన ఆలోచనను గ్రామానికి చెందిన మిత్రులతో పంచుకున్నాడు. వాళ్లు కూడా ప్రోత్సహించడంతో ఓ పాత రిక్షాను కొనుగోలు చేశాడు. దానిని తీసుకుని మెకానిక్ తగ్గరకు వెళ్లాడు. రిక్షా వెనుక భాగాన్ని తొలగించి దానిని బైక్ వెనక భాగానికి అటాచ్ చేయాలని సూచించాడు. దీంతో సదరు మెకానిక్.. రిక్షా వెనుకభాగాన్ని తీసుకుని దానికి రెండు ఇనుప కడ్డీలు బిగించి.. దానిని బైక్ వెనుక భాగానికి అమర్చాడు. దీంతో బైక్ రిక్షా రెడీ అయిపోయింది.
తొమ్మిది మంది ప్రయాణం..
ఇలా తయారు చేసిన తన బైక్ రిక్షాలో ఇప్పుడు తొమ్మిది మంది ఈజీగా ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా సులభంగా వెళ్తున్నారు. బైక్‌పై తనతోపాటు ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుంటున్నాడు. వెనకాల రిక్షా భాగంలో ముగ్గురు పెద్దలు, ముగ్గురు పిల్లలను కూరో బెట్టుకుని బైక్ కిక్ కొట్టి రయ్.. రయ్ మంటూ సాగిపతోతున్నాడు.
సోషల్ మీడియాలో చెక్కర్లు..
యువకుడు చేసిన ప్రయోగం ఫలించడంతో ఈ వాహనంలో యూపీలోని బారాబంకీ నుంచి లక్నో–అయోద్య హైవేపై తన కుటుంబ సభ్యులతో బైక్ రిక్షాలో వెళ్తుండగా ఎవరూ ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌అవుతోంది. నీ తెలివికి దండాలు సామీ అని చాలా మంది అభినందిస్తున్నారు. అవసరం నుంచి ఆవిష్కరణ వస్తే ఇలా ఉంటంది అని.. దేశంలో మేధావులకు కొదవ లేదు.. భారత దేశం మేదావులకు నిలయం అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను లక్ష మందికిపైగా చూశారు.