Homeట్రెండింగ్ న్యూస్Footprints On Moon: యాభై ఏళ్లయినా చంద్రుడిపై చెరగని మానవ ముద్రలు.. వైరల్ వీడియో

Footprints On Moon: యాభై ఏళ్లయినా చంద్రుడిపై చెరగని మానవ ముద్రలు.. వైరల్ వీడియో

Footprints On Moon: శాస్త్ర సాంకేతికత పెరుగుతోంది. మానవుడు తన తెలివితో ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. పూర్వం రోజులకు ఇప్పటికి ఎంతో తేడా ఉంది. భవిష్యత్ లో మరిన్ని నూతన ఆవిష్కరణలు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయినా ఆ జాడలు ఇంకా తొలగిపోవడం లేదు. ఇప్పటికి ఆ ఛాయలు అలాగే ఉండటం గమనార్హం. దీంతో చంద్రుడిపై మానవుడు తనదైన ముద్ర వేస్తూ నడిచిన ముద్రలు ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి.

Footprints On Moon
Footprints On Moon

అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్ స్ర్టాంగ్ మొట్టమొదట చంద్రుడిపై కాలు మోపి రికార్డు సాధించాడు. మన దేశం నుంచి కూడా రాకేశ్ శర్మ చంద్రుడిపై కాలు మోపిన ఘనత సాధించడం తెలిసిందే. ఎన్నేళ్లయినా దాని తాలూకు గుర్తులు ఇంకా కనిపించడం విశేషం. వ్యోమగాములు నడిచిన బాటలు ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు నాసా ద్వారా గ్రహించడంతో అప్పటి గుర్తులు అలాగే ఉండటంతో మనం సంచరించిన వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది.

Also Read: New Car Sales: కొత్త కార్ల కోసం ఎగబడుతున్నారు.. అందుకే ఫుల్ ఆర్డర్లు అట

ఏప్రిల్ 20, 1969లో వ్యోమగాములతో కూడిన అపోలో 11 నౌక చంద్రుడిపై అడుగిడిది. దీంతో దాదాపు రెండు గంటలకు పైగా వ్యోమగాములు చంద్రుడిపై నడిచారు. అక్కడి పరిస్థితులను ఫొటోలు తీశారు. మానవాళి కోసం ఎన్నో పరిశోధనలు జరిగాయి. శాస్త్ర సాంకేతికత పెరగడంతో ఎన్నో రకాల పరిశోధనలు కొనసాగినా చంద్రుడిపై ఇంతవరకు నివాసం మాత్రం ఏర్పాటు చేసుకోలేదు. కానీ భవిష్యత్ లో చంద్రుడిపై కూడా నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

Footprints On Moon
Footprints On Moon

శాస్త్రీయంగా పరిణతి చెందుతున్న క్రమంలో మానవాళి అభివృద్ధికి ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో చంద్రుడిపై కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. అందుకు రకరకాల పద్ధతుల్లో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాసా పలు రకాల చర్యలు చేపడుతోంది. రాబోయే కాలంలో ఇంకా అనేక నూతన ఆవిష్కరణలు చేపట్టి మునుముందు ఎన్నో అంచనాలు చేస్తారని సమాచారం.

Also Read:Presidential Election: ఆధిక్యం దిశగా ముర్ము.. వెనుకబడిన యశ్వంత్ .. ద్రౌపది ఎన్ని ఓట్లు సాధించారంటే?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular